ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ 9 సీజన్ కి సంబంధించి అన్ని కార్యక్రమాలు చక్క చక్క జరుగుతున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ షో నిర్వహకులు సైతం ఈసారి మరింత ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ముందు నుంచే ప్లాన్ చేస్తూ రెండు ప్రోమోలను విడుదల చేశారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరైనా వెళ్లాలనుకునే వారికి అవకాశం కల్పించింది. కామన్ మ్యాన్ కేటగిరీలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉన్నది. బిగ్ బాస్ 9 వ సీజన్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం పైన ఆడియన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.


తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రకారం ఈసారి త్వరగానే బిగ్ బాస్ 9 సీజన్ మొదలు కాబోతోందని అది కూడా ఆగస్టులోనే మొదలు కాబోతోందనే విధంగా వినిపిస్తున్నాయి. ఈసారి ఒక నెల ముందుగానే ఈ రియాలటీ షో మొదలు కాబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి తాజాగా లీక్ బయటికి వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 31న ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని విషయాలు వినిపిస్తున్నాయి.


గత సీజన్ అయితే సెప్టెంబర్ 1న మొదలుపెట్టారు.. అయితే ఈసారి సెప్టెంబర్ 7న ఆదివారం సాయంత్రం చాలా గ్రాండ్గా ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లు  మరొక టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అయితే బిగ్ బాస్ నిర్వాహకుల చేతిలో 50 రోజులకు పైగా సమయం ఉంది కాబట్టి అన్ని రకాల వాటికి సన్న హాలు చేస్తున్నారు. కానీ ఈసారి హౌస్ లోకి ఎవరెవరు వస్తారనే విషయం పైన చాలామంది పేర్లు  వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా ఇందులో హీరో రాజ్ తరుణ్, హీరో రోహిత్, సుమంత్ అశ్విన్ , అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, రీతు చౌదరి, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, సాయి కిరణ్, కల్పికా గణేష్, వీరే కాకుండా మరి కొంతమంది పేర్లు వినిపిస్తున్న ఈసారి లాంచింగ్ రోజు 18 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించేలా ప్లాన్ చేస్తున్నారు.. 9 మంది బాయ్స్ మరో 9 మంది గర్ల్స్ ని పంపించేలా ప్లాన్ చేస్తున్న బిగ్ బాస్. నవరత్నాలు అనే కాన్సెప్ట్ తో గేమ్స్ ని ఆడించబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: