ఇప్పుడున్న ప్రతి ఒక్కరి దగ్గర మాక్సిమం కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉంటుంది. అయితే మన ఇండియాలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఇతర కంట్రీస్ కి వెళితే చెల్లుతుందా అని విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. అయితే ఈ విషయంపై ఇప్పుడు మనం తెలుసుకుందాం.

డ్రైవింగ్ లైసెన్స్ తో కార్లుvఇతర దేశాలలో నడపాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయట. ఇప్పుడు కొన్ని దేశాలలో డ్రైవింగ్ లైసెన్స్ గురించి తెలుసుకుందాం.

1). జర్మనీ:
మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వారు అక్కడి వాహనాలను నడుపుకోవచ్చు. కానీ డ్రైవింగ్ లైసెన్స్ మీద ఉండే పదాలు అన్ని ఇంగ్లీషులో కానీ,జర్మనీ భాషలో కానీ ఉండాలి.

2). ఆస్ట్రేలియా:
ఇక్కడ కేవలం ఇంగ్లీష్ లోనే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కు అక్కడ చట్టం ప్రకారం 3 నెలలు మాత్రమే అనుమతి.

3). దక్షిణాఫ్రికా:
ఇక్కడ కూడా మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుతుంది. ఇక్కడ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కాపీ ఇంగ్లీష్ లో ఉండాలి. ఇక లైసెన్స్ పై సిగ్నేచర్ ఫోటో తప్పనిసరిగా ఉండాలి.

4). స్విజర్లాండ్:
ఇక్కడ కూడా మన భారతదేశపు లైసెన్స్ ఒక ఏడాది పాటు చెల్లుతుంది. అక్కడి వాహనాలను లీజుకు కూడా ఇస్తారు.

5). బ్రిటన్:
ఈ దేశంలో కూడా ఒక సంవత్సరం పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగించుకోవచ్చు.

6). మలేషియా:
ఇక్కడ వాహనాలు రోడ్డుమీద నడపాలంటే ఖచ్చితంగా వారి భాషలో లైసెన్స్ ఉండాలి.మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ని అక్కడ MBC గా గుర్తించాలి.

7). స్వీడన్:
ఈ దేశంలో కూడా భారతదేశం డ్రైవింగ్ లైసెన్స్ కి అనుమతి ఉంటుంది. కానీ వారు ఫ్రెంచ్ భాషలో నే ఇది ఉండాలట.

8). సింగపూర్:
ఇక్కడ మన లైసెన్స్ కేవలం ఒక సంవత్సరం పాటు ఉపయోగపడుతుంది. కానీ అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లు అయితే.. ఎక్కడైనా తిరగవచ్చు.

9). న్యూజిలాండ్:
ఇక్కడ కేవలం ఇతర దేశస్తులు ఎవరైనా సరే.. వారి పేరు మీద ఏ కారు మంజూరైన ఉంటుందో ఆ కారణం మాత్రమే నడపవలసి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: