విటమిన్ ఈ క్యాప్సూల్స్ గురించి కొంతమందికి మాత్రమే తెలుసు.అయితే ఈ క్యాప్స్యూల్స్ వాడడం వల్ల ఆడవాళ్ళకి చాలా ఉపయోగాలు ఉన్నాయి తెలుసావీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ ఆయిల్‌‌ని శరీరంలోని వివిధ భాగాలలో, అంటే తల నుంచి పాదాల వరకూ ఉపయోగించవచ్చు.విటమిన్ ఇ క్యాప్సూల్స్ యొక్క బెనిఫిట్స్ పొందటానికి మీరు ఇలాంటి చిట్కాలు ట్రై చేయండి.మనలో చాలా మందికి గోర్లు పెంచడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, గోర్లు చేతికి మరింత అందాన్ని ఇస్తాయి. అందుకే చాలా మంది పెద్దగా గోర్లు పెంచుకుని వాటికీ మాచింగ్ నైల్ పాలిష్ వేసుకుంటారు. కానీ, మనం ఎప్పుడు అనేక పనులు చేస్తూ ఉంటాం. వంట చేయడం, బట్టలు ఉతకడం, తోటపని, గిన్నెలు తోమటం ఇలా వివిధ రకాల పనులు చేస్తూ ఉంటారు.




 రోజు పనులు చేయడం వల్ల మీ గోళ్ళపై ప్రభావం పడుతుంది. దీంతో గోర్లు విరిగిపోవడం, గీతలు పడటం లాంటివి జరుగుతాయి. దీంతో, గోర్ల ఆరోగ్యం పాడవ్వటం వల్ల అవి పసుపు రంగులోకి మారి విరిగిపోతూ ఉంటాయి. దీని కోసం చాలా మంది బ్యూటీ పార్లర్ లకు వెళ్తూ ఉంటారు. అయిన అవి అంత ప్రభావం చూపవు. అందుకే మీ కోసం ఇంటి వద్ద పాటించే కొన్ని విషయాలను పాటించండి. దీనిని తగ్గించడానికి, మీకు కావలసిందల్లా విటమిన్ ఈ క్యాప్సూల్. మీ గోర్లు, క్యూటికల్స్, మీ గోళ్ళ చుట్టూ ఉన్న చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేయడానికి ఈ క్యాప్స్యూల్స్‌లోని నూనెని వాడండి. నిద్ర పోవటానికి ముందు ఈ విటమిన్ ఈ క్యాప్స్యూల్స్ ను గోర్లు, చుట్టూ ఉన్న చర్మానికి చక్కగా మర్దన చేస్తే మీ గోర్లు తేమను పొందుతాయి. దీంతో మీ గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి.



చర్మ సౌందర్యానికి అవసరమైన విటమిన్స్‌లో విటమిన్ ఇ ఒకటి. అందుకే చాలా బ్యూటీ ప్రొడక్ట్స్‌లో విటమిన్ ఇ‌ని వాడతారు. విటమిన్ ఇ చర్మ సౌందర్యానికి దోహదపడతుందికి. చర్మానికి కాంతివంతంగా, యవ్వనంగా ఉంచడానికి విటమిన్ ఇ సాయపడుతుంది. విటమిన్ ఇ క్యాప్స్యూల్స్ చర్మంలో తేమను కాపాడుకోవడానికి తోడ్పడతాయి. దీని వల్ల చర్మం గ్లో, సున్నితత్వాన్ని పొందుతుంది. ఈ క్యాప్స్యూల్ వల్ల మంచి రిజల్ట్స్ కోసం రాత్రిపూట ముఖానికి రాసుకునే క్రీమ్ లో కొద్దిగా విటమిన్ ఇ క్యాప్స్యూల్ వేస్తే ముఖానికి అద్భుతంగా పనిచేస్తుంది. మీరు విటమిన్నూనె యొక్క కొన్ని చుక్కలను మీ రెగ్యులర్ నైట్ క్రీమ్‌లో కలిపి ముఖం కడిగిన తరువాత రాసుకోండి. ఇది మీ చర్మానికి సీరమ్‌లా పనిచేస్తుంది. రాత్రి సమయంలో మీ ముఖానికి తగినంత తేమను అందిస్తుంది. బెడ్ షీట్స్, దిండ్లకు నూనె మరకలు అంటకుండా ఉండేందుకు, ఈ క్రీమ్‌ని పడుకోవటానికి కనీసం 30 నిమిషాల ముందు రాసుకోండి.




మరింత సమాచారం తెలుసుకోండి: