పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా ఇప్పుడు అందరూ కూడా ఎలెక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. వినియోగ దారులకు అదిరిపోయే ఆఫర్ల తో ఆయా కంపెనీలు కూడా సరికొత్త టెక్నాలజీ ఉన్న వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. తాజాగా ఓ స్టార్టప్ సంస్థ వినూత్న ఈ-స్కూటర్ ను అభివృద్ధి చేసింది. ఈ టూ-వీలర్ ద్వారా ప్రయాణ ఖర్చు కిలోమీటరుకు 20 పైసలే ఉంటుందని ఆ సంస్థ స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఐఐటీ-దిల్లీకి చెందిన ఆదిత్య తివారీ గేలోస్ మొబిలిటీ అనే అంకుర సంస్థను ఏర్పాటు చేశాడు.


ఈ స్టార్టప్ ద్వారా హోప్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంఛ్ చేశాడు. ఈ స్కూటర్ కు ఇంటర్నెట్ ను కూడా కనెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.బడ్జెట్ ధరకే వచ్చే ఈ టూ-వీలర్ నడిపేందుకు కిలోమీటరుకు 20 పైసల ఖర్చు మాత్రమే అవుతుంది. సాధారణ పెట్రోల్ స్కూటర్లో కిలోమీటరుకు రూ.2.5 ఖర్చు అవుతుంది" అని కంపెనీ వ్యవస్థాపకుడు ఆదిత్యా తివారీ పేర్కొన్నారు. తక్కువ ధర కూడా ఉంది.ప్రస్తుతం వీటి ధర కేవలం రూ. 46,999లని, పోర్టబుల్ బ్యాటరీ సదుపాయం ఇందులో ఉందని చెప్పాడు.


అంతేకాకుండా రేంజ్ విషయంలో వినియోగదారులకు ఇందులో రెండు వేరియంట్ లలో ఉన్నాయి. ఈ మిని స్కూటర్ కు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 75 కిలోమీటర్లు రేంజ్ ఇచ్చే ఆప్షన్ మొదటిది కాగా.. 50 కిలోమీటర్ల రేంజ్ రెండోది అని అతడు స్పష్టం చేశాడు. ఈ స్కూటర్లో పోర్టబుల్ బ్యాటరీ ఉంది. గంటకు గరిష్ఠంగా 25 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. ఇందులో పాడిల్ అసిస్ట్ టెక్నాలజీని కూడా పొందుపరిచారు.గమ్యాలను చేరేందుకు ఈ స్కూటర్ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పర్యావరణ హితంగా రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారుల ప్రయాణ ఖర్చును బాగా తగ్గిస్తుంది. తక్కువ ధరకే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.. అందుకే వీటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: