ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో మంచి ఆదరణ పొందిన కార్లలో టాటా పంచ్ కూడా ఒకటి. ఇటీవల కాలంలో అత్యధికంగా అమ్మకాలు జరుపుకున్న కారుగా ఈ కారు గుర్తింపు పొందింది.టాటా పంచ్‌ ప్యూర్‌, అడ్వెంచర్‌, అకాంప్లిష్డ్‌ ఇంకా క్రియేటివ్‌ వంటి మొత్తం 4 ట్రిమ్‌లలో లభిస్తుంది.ఇక ఈ కారు ప్రారంభ ధర రూ.6 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉండగా.. టాప్‌ వేరియంట్ ధర మాత్రం రూ.10.10 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. టాటా పంచ్‌ మైక్రో SUV పెట్రోల్‌ ఇంకా cng ఇంజిన్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇక ఈ కారు పెట్రోల్‌ వెర్షన్‌.. 1.2 లీటర్‌ 3 సిలిండర్‌ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.అలాగే సీఎన్‌జీ వేరియంట్‌ కూడా ఇదే ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.ఇక పెట్రోల్‌ వెర్షన్‌ 84 bhp మరియు 113Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అదే సీఎన్‌జీ వెర్షన్‌లో 72 bhp శక్తి, 103Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. పెట్రోల్‌ ఇంజిన్‌తో పోలిస్తే cng వేరియంట్ అవుట్‌పుట్‌ తక్కువగా ఉన్నా.. cng వేరియంట్‌ ఇంకా ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. టాటా పంచ్‌ cng వేరియంట్‌ మొత్తం 26.99 కి.మీ మైలేజీని ఇస్తుంది.ఇక అధిక మైలేజీ కారణంగా టాటా పంచ్‌ మైక్రో SUV సీఎన్‌జీ వెర్షన్‌కు భారీ డిమాండ్‌ ఉంది.


నవంబర్‌ నెలలో సీఎన్‌జీ వేరియంట్ వెయిటింగ్ పిరియడ్‌ మొత్తం 3 నుంచి 12 వారాలుగా ఉంది. ఇక వెయిటింగ్ పిరియడ్‌లో ప్రాంతం, రాష్ట్రం ఆధారంగా మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇక పెట్రోల్‌ వెర్షన్‌ వెయిటింగ్‌ పిరియడ్‌ మాత్రం 3 నుంచి 4 వారాలు ఉంది.టాటా పంచ్‌ మైక్రో SUV 3827 mm పొడవు, 1742 mm వెడల్పు, 1615 mm ఎత్తు, 2445 mm వీల్‌బేస్‌ ఇంకా 187 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. అలాగే 5 మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చొని ప్రయాణం చేయవచ్చు.ఇది మొత్తం 210 లీటర్ల బూట్‌స్పేస్‌ను కలిగి ఉంటుంది. ఇంకా అలాగే 60 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.ఈ మైక్రో ఎస్‌యూవీ కార్ గ్లోబల్‌ NCAPలో 5 స్టార్‌ రేటింగ్‌ను పొందింది. ఇంకా చైల్డ్ సీట్‌ యాంకర్ పాయింట్‌, సీట్ బెల్ట్‌ వార్నింగ్‌, ఓవర్‌ స్పీడ్‌ లిమిట్‌, లేన్ డిపాచర్ వార్నింగ్‌, ఫార్వర్డ్‌ కొలిజన్‌ వార్నింగ్, హైబీమ్ అసిస్ట్‌, లేన్‌ డిపాచర్‌ ప్రివెన్షన్‌, డ్యాష్‌క్యామ్, యాంటీలాక్‌ బ్రేకింగ్ సిస్టమ్‌, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్ హోల్డ్‌ కంట్రోల్‌ ఇంకా ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ వంటి ఫీచర్లున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: