విజయవాడ నగరంలో నవంబర్ 19, 20 తేదీల్లో అయ్యప్ప మహా సంగమం నిర్వహించనున్నారు. ఈమేరకు అఖిల భారత అయ్యప్పధర్మ ప్రచారసభ జాతీయ అధ్యక్షులు కె. అయ్యప్పదాస్ తెలిపారు. అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని అయ్యప్పస్వామి వారి చరిత్రతో సత్సంబంధం కలిగిన సుమారు 11 వంశస్తులు హాజరవుతారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి కోట్లాది మంది అయ్యప్ప భక్తులు హాజరవుతారన్నారు.

నవంబర్ 18న గోపూజతో ఈ పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. 19న అయ్యప్పస్వామికి యంత్ర, మంత్ర, తంత్రయక్త గణపతిపూజ, అష్టాదశ మహాహోమములు జరుగుతాయి.ఇరవయ్యో తేదీన స్వామి వారికి అష్ఠాభిషేకములు, త్రికాల అయ్యప్పసేవ, త్రికాల భగవతీసేవ సహిత సక్షార్చన, మహాపడిపూజ, మహాపుష్పాభిషేకంతో పాటు భజానా కార్యక్రమం నిర్వహిస్తారు.ఇంత చక్కటి అవకాశం విజయవాడ నగర ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సధ్వినియోగం చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: