జుట్టుకు సంబంధించిన సమస్యల నుండి బయటపడడానికి ఎన్నో రకాల షాంపులను ఇంకా నూనెలను వాడుతూ ఉంటారు. అందుకోసం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి లాభం లేక బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. చాలా న్యాచురల్ గా కూడా మనం ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. మన ఇంట్లో తయారు చేసుకున్న నూనెను వాడడం వల్ల ఈ జుట్టు సమస్యలన్నింటిని చాలా ఈజీగా నయం చేసుకోవచ్చు.జుట్టు సంబంధిత సమస్యలను తగ్గించే ఈ న్యాచురల్ నూనెను ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి ఇంకా అలాగే దీనిని ఎలా వాడాలి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. జుట్టు సమస్యలన్నింటిని తగ్గించడంలో మందార పువ్వు మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇక ఈ నూనెను తయారు చేసుకోవడానికి మనం కొబ్బరి నూనెను ఇంకా అలాగే మందార పువ్వులను వాడాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఒక వెడల్పాటి గిన్నెలో కొబ్బరి నూనెను వేసి 5 నిమిషాల పాటు వేడి చేయాలి.


ఆ తరువాత మందార పువ్వు రేకులను వేసి రంగు మారే వరకు వాటిని వేయించాలి. ఆ తరువాత ఈ నూనెను వడకట్టి తరువాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత దూదిని తీసుకుని మందార నూనెలో ముంచి కుదుళ్లకు అంటేలా బాగా అప్లై చెయ్యాలి. ఇలా మీరు ప్రతిరోజూ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ మందార నూనె జుట్టు సమస్యలను తగ్గించి వేగంగా జుట్టు పెరిగేలా చేస్తుంది. ఈ నూనెను వాడడం వల్ల కుదుళ్లు బాగా గట్టి పడి జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు నల్లగా ఇంకా ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య కూడా చాలా ఈజీగా తగ్గుతుంది. ఈ మందార నూనె అనేది పొడి జుట్టు ఉన్న వారికి చాలా బాగా పని చేస్తుంది. ఇక ఈ నూనెను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా తక్కువ ఖర్చుతో మీ జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఇంకా అలాగే కాంతివంతంగా కూడా మార్చుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: