ఆంధ్రప్రదేశ్ శాశన మండలి రద్దు అంశానికి సంబంధించి ఏపీలో దాదాపు ఏడాది నుంచి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కీలక ప్రశ్న వేసారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజూజు... ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన తీర్మానం అందింది అని తెలిపారు.

ఈ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని అన్నారు. కాగా ఇప్పుడు శాసన మండలిలో క్రమంగా ఏపీ అధికార పార్టీ బలం పెరుగుతుంది కాబట్టి శాసన మండలిని రద్దు చేస్తే అధికార పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రద్దు చేస్తూ తీర్మానం పంపారు కాబట్టి దాదాపుగా రద్దు చేసే అవకాశాలు ఉండవచ్చు అని వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: