లోన్ యాప్ కేసులు ఇప్పుడు తెలంగాణా సహా ఏపీలో ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. చాలా మంది వీటి బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుణ యాప్ ల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఫైనాన్స్ కంపెనీ పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రై.లి.కి చెందిన రూ.106 కోట్లు జప్తు చేసింది. క్యాష్ బీన్ మొబైల్ యాప్ ద్వారా రుణాలు ఇచ్చింది పీసీఎఫ్ఎస్.

చైనాకు చెందిన జో యాహుయ్ అధీనంలో పీఎస్ఎఫ్ఎస్ పనిచేస్తోందని ఈడీ అధికారులు వెల్లడించారు. బోగస్ సాఫ్ట్ వేర్ ఎగుమతుల పేరిట విదేశాలకు నిధులు మళ్లించినట్లు గుర్తించారు. చైనా, హాంకాంగ్, తైవాన్, యూఎస్, సింగపూర్ కు నిధులు తరలించినట్లు ఈడీ తన విచారణలో గుర్తించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు పీసీఎఫ్ఎస్ సొమ్ము జప్తు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ కేసుపై తెలుగు రాష్ట్రాల్లో కొందరిని అదుపులోకి తీసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

app