కొత్త సంవత్సరం అంటే కొత్త రూల్స్ ను అమలు చేస్తున్నారు.. బ్యాంక్ ఖాతాదారులకు మాత్రం మరి కాస్త ఎక్కువ రూల్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు బ్యాంక్ కు సంబంధించిన అన్ని లావాదేవీలపై ఆర్బీఐ బ్యాంక్ మార్పులు చేసింది. మొన్న జీఎస్టీ చెల్లింపుల పై కొత్త రూల్స్ పెట్టిన ఆర్బీఐ బ్యాంక్ ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు. చెక్కు చెల్లింపు పై పాజిటివ్ సిస్టమ్ ను ప్రవేశ పెట్టింది.రూ.50 వేలకు పైన ఉన్న చెక్కులకు అవసరమైన సమాచారం మళ్లీ నిర్ధారించనున్నారు. చెక్ చెల్లింపుల కోసం ఈ కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. చెక్ చెల్లింపులను సురక్షితం చేయడంతోపాటు బ్యాంక్ మోసాలను నిరోధించడానికి ఈ కొత్త నియమాలు రూపొందించారు.



అయితే కొత్త నిబంధనల ప్రకారం చెక్కులను జారీ చేసే వ్యక్తి చెక్ తేదీని ఎలక్ట్రానిక్ పద్ధతిలో గ్రహీత పేరు, చెల్లింపు మొత్తాన్ని తిరిగి తెలియజేయాల్సి ఉంటుంది. చెక్ జారీ చేసే వ్యక్తి ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎం వంటి ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా ఈ సమాచారాన్ని తెలియ జేయవచ్చు. చెక్ చెల్లింపునకు ముందు ఈ వివరాలను బ్యాంకు సిబ్బంది క్రాస్ చెక్ చేసుకుంటారు. ఏదైనా లోపం కనబడితే, అది 'చెక్ ట్రంకేషన్ సిస్టం' ద్వారా గుర్తించి.. సమాచారాన్ని చెక్ చెల్లింపు చేయవలసిన బ్యాంక్, చెక్‌ జారీ చేసిన బ్యాంకులకు అందుతుంది.



చెక్కు ద్వారా లావాదేవీలను చెల్లించే వారికి 50 వేలకంటే పైన ఉంటే ఈ విధానం తప్పక వర్తిస్తుందని తాజాగా ఆర్బీఐ నిర్ణయించింది..రూ.5 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువ చేసే చెక్కుల విషయంలో బ్యాంకులు ఈ నిబంధనలను తప్పనిసరి చేయవచ్చు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ వ్యవస్థను అభివృద్ధి చేసి అన్ని బ్యాంకులకు అందుబాటులో తీసుకువచ్చింది... చెక్కులు చెల్లించే వాళ్ళు ముందుగా అన్నీ చెక్కు చెల్లింపు నిబంధనలను తెలుసుకొని చెక్కును చెల్లించాలని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: