ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... పచ్చి బఠాణీ ఎంతో రుచికరమైనది. అలాగే పచ్చి బఠాణీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పచ్చి బఠాణీ జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుంది. దీనిలో మంచి ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. పచ్చి బఠాణీ తో అనేక రకాల రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. ఇక రుచికరమైన టమాటో కర్రీని కూడా తయారు చేసుకోవచ్చు. ఇక పచ్చి బఠాణీతో రుచికరమైన టమాటో కూరని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.మీరు ఇంట్లో తయారు చేసుకోండి....


రుచికరమైన పచ్చి బఠాణీ టమాటో కూర తయారు చెయ్యడానికి కావాల్సిన పదార్ధాలు....


ఉడకబెట్టిన పచ్చి బఠాణీలు - కప్పు;
టొమాటో గుజ్జు - ఒక కప్పు;
కొత్తిమీర - అర కప్పు;
పచ్చి మిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు;
మిరప కారం - అర టీ స్పూను;
ధనియాల పొడి - అర టీ స్పూను;
నీళ్ళు - తగినన్ని;
జీలకర్ర - అర టీ స్పూను;
ఇంగువ - చిటికెడు;
పసుపు - పావు టీ స్పూను;
నూనె - తగినంత...


రుచికరమైన పచ్చి బఠాణీ టమాటో కూర తయారు చేసే విధానం....


ముందుగా  స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఇంగువ, జీలకర్ర, పచ్చి మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి. టొమాటో గుజ్జు జత చేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.మిరప కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. మంట కొద్దిగా తగ్గించి, రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. కొద్దిగా నీళ్లు జత చేసి కలపాలి. నీరు పొంగుతుండగా పచ్చి బఠాణీలు వేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి. గ్రేవీ చిక్కగా ఉండటానికి బాణలిలో ఉడుకుతున్న వాటిని కొన్నిటిని మెత్తగా మెదిపితే చాలు. చపాతీ, రోటీ, పూరీ, అన్నం.. దేనిలోకైనా రుచిగా ఉంటుంది.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....


మరింత సమాచారం తెలుసుకోండి: