పవన్ కల్యాణ్ పై తిరుగుబాటు మొదలైనట్లే తెలుస్తుంది. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ తో ఉన్న పెడన జనసేన నియోజకవర్గ ఇన్ చార్జి వైసీపీలో చేరారు. చేరడంతోనే పవన్ కల్యాణ్ పై విమర్శలు చేయడం మొదలెట్టారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన తర్వాత పార్టీలో ఉన్న జనసేన నాయకులకు కానీ, కార్యకర్తలకు గానీ ఎవరికి చెప్పకుండా టీడీపీ అధ్యక్షుడిని జైల్లో కలవడానికి వెళ్లడం ఎంత వరకు కరెక్టు అని ప్రశ్నించారు.


గతంలో నారా లోకేశ్ పవన్ కల్యాణ్ ను కుటుంబ పరంగా విమర్శించిన విషయాన్ని మరిచిపోవడం బాధకరమని ఆయన అన్నారు. ఒక పార్టీని నడుపుతున్నప్పుడు నాయకులను సంప్రదించి ఆచి తూచి తీసుకోవాల్సిన నిర్ణయాలను ఏక పక్షంగా తీసుకోవడం వల్ల పవన్ తన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా అయితే ఆ పార్టీ ఎప్పటికీ రాజకీయాల్లో రాణించదు.


పార్టీలో ఉన్న కార్యకర్తల్ని, నాయకుల్ని అభిప్రాయాలు అడిగి ప్రతిపక్ష నేత అరెస్టు అయ్యారు. ఈ సమయంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఎలా ముందుకెళ్లాలి. ఎలా వెళితే బాగుంటుంది.. ఇలా చర్చలు జరపాలి. పార్టీలో అంతర్గతం చర్చించి ముందుకెళ్లాలి. కానీ ఒకప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును జైల్లో కలిసి పరామర్శించి పొత్తు పెట్టుకుంటున్నామని ఏక పక్షంగా మాట్లాడటం సరికాదు.


పవన్ ను ఇలా ఎవరైనా ప్రశ్నిస్తే వారు జనసేన తిరుగుబాటు దారులుగా మారిపోతారు. లేకపోతే వైసీపీ అనుకూల వ్యక్తులుగా మిగిలిపోతారు. ఇలా ఎవరైనా పార్టీలోని నాయకులను చూస్తారా? పార్టీకి అన్ని రకాలుగా సాయం చేసిన వారి పట్ల పవన్ చూపించే అభిమానం ఇదేనా ఇలా చేయడం కరెక్టేనా.. అంటూ జనసేన అధినేతపై పెడన జనసేన నియోజకవర్గం ఇంచార్జి విమర్శించారు. జనసేనలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు వ్యాల్యూ లేదని చెప్పడానికి ఇంత కంటే పెద్ద కారణం మరోటి ఉండకపోవచ్చని అంటున్నారు. మరి పవన్ కల్యాణ్ రాబోయే రోజుల్లో ఇలాంటి ఎన్నో విమర్శలు ఎదుర్కొని నిలబడాల్సిన అవసరమైతే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: