ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి కోర్సులు చదవాలన్నా, సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో ఎన్నో యూనివర్సిటీలు పలు కోర్సుల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నాయి. అందులో పీజీ కూడా ఒక‌టి. పీజీ చేయాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్‌.

 

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు www.anu.ac.in/ www.anudoa.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా మ్యాథమెటిక్స్, ఆర్ట్స్, సైన్స్ తదితర పీజీ కోర్సుల్లో యూనివర్సిటీతో పాటు దీనికి అనుబంధంగా పనిచేస్తోన్న కాలేజీల్లోనూ ప్రవేశం కల్పిస్తారు. 20 ఏప్రిల్ 2020 దరఖాస్తు చివరి తేదీ. అస‌క్తిక‌ర అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను.

 

అలాగే ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600 కాగా, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షను పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే నిర్వహిస్తారు. 90 నిమిషాల్లో 100 మార్కులను గుర్తించాల్సి ఉంటుంది. ఇక మే 5, 6, 7 తేదీల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: