పండుగలు వచ్చాయి అంటే మహిళల చూపు బంగారం వేపే ఉంటుంది.. ఎప్పుడూ బంగారం కొందామా అనుకుంటారు.ఇక ఇదే విధంగా బంగారానికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది..మామూలు రోజుల్లోనే బంగరానికి రెక్కలు వస్తున్నాయి..మరి ఇప్పుడు ధరలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు.. విదేశీ మార్కెట్ల సంకేతాల కారణంగా బంగారం ధరలు నేటికీ పెరుగుతూనే ఉన్నాయి. అయితే మరోవైపు ఈరోజు వెండి కాస్త వెనక్కి తగ్గింది.



గురువారం బంగారం ధరలు పెరుగుదలతో 10 గ్రాములకు 52 వేల స్థాయిని దాటాయి. పండగ సీజన్ తర్వాత పెళ్లిళ్ల సీజన్ లో బంగారానికి డిమాండ్ పెరుగుతుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీని వల్ల పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధర 53 వేల స్థాయికి చేరుకోవచ్చంటున్నారు.ఇక ఈ రోజు ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.497 పెరిగి రూ.52,220కి చేరుకుంది. క్రితం సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.51,723 వద్ద ముగిసింది. మరోవైపు వెండి ధర రూ.80 తగ్గి రూ.61,605కి చేరుకుంది. క్రితం సెషన్‌లో వెండి 61,685 స్థాయి వద్ద ముగిసింది. విదేశీ మార్కెట్ల సంకేతాలు, పండుగల సీజన్ డిమాండ్ కారణంగా బంగారం ధర పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 



అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్స్‌కు 1722 డాలర్లు, వెండి ఔన్స్‌కు 20.68 డాలర్ల వద్ద స్థిరత్వంతో ట్రేడవుతోంది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ ప్రకారం.. పండుగ డిమాండ్, విదేశీ మార్కెట్‌లలో బంగారం ధరల పెరుగుదల కారణంగా దేశీయ మార్కెట్‌లో బంగారం నిరంతరం పెరుగుతోంది.ఇప్పుడు బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బంగారం రూ.53000 స్థాయిని తాకవచ్చు. మరోవైపు, వెండి 63000 నుండి 65000 స్థాయిని తాకవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. కొన్ని నగరాల్లో ఎక్కువ ధర ఉంటే.. మరి కొన్ని నగరాల్లో తక్కువగా ఉంటుంది..ఇది ఇలా వుంటే..ఈ పండగకు బంగారం ధరలు మరింత పైకి చేరవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: