తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నవలా నాయకుడు అన్న పేరుతో అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో గొప్ప నవలలను చిత్రాలు గా చేసి హిట్టు సంపాదించి గొప్ప  పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఆ తర్వాత ఆ స్థాయిలో  నవలా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన హీరో చిరంజీవి అనే చెప్పాలి. అక్కినేని నాగేశ్వరరావు ఎక్కువగా లవ్ స్టోరీస్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో రూపొందిన నవలను చిత్రాలు గా చేసి ప్రేక్షకులను అలరించేవారు. అయితే ఆ తర్వాత  చిరంజీవి క్రైమ్, యాక్షన్ నవలలను చిత్రాలుగా చేశారు. చిరు కోసమే అన్నట్లుగా కొన్ని నవలలు పుట్టు కొచ్చాయి.

ఆ నవలలో చిరంజీవి నటించి వాటికి కూడా మంచి పేరు తీసుకు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి నవలా చిత్రం న్యాయం కావాలి. డి. కామేశ్వరి రాసిన నవల ఆధారంగా న్యాయం కావాలి చిత్రాన్ని రూపొందించగా మెగాస్టార్ కెరీర్ లోనే ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఏ కోదండరామిరెడ్డి కాంబినేషన్  తెరకెక్కిన చిత్రాలు చాలా వరకు కూడా నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలే. ఆయన హీరోగా చేసిన అభిలాష డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు ఆధారంగా తెరకెక్కింది. ఆ తర్వాత రాక్షసుడు అనే నవల పేరు మీదుగా అదే పేరుతో ఓ సినిమా చేశారు.

చిరంజీవి మరణ మృదంగం అనే సినిమా కూడా నవల ఆధారంగా రూపొందిందింది. ఆ తరువాత అయితే రక్తసింధూరం చంటబ్బాయి రుద్రనేత్ర వంటి సినిమాలు యండమూరి రాసిన నవలలకు సినిమా ప్రతిరూపాలు. మొదట్లో నవలలను సినిమాలుగా తెరకెక్కించిన చిరంజీవి ఆ తరువాత రీమేక్ సినిమాలు చేసి వరుస హిట్లు సాధించారు. ఇప్పుడు కూడా ఆయన రెండు రీమేక్ సినిమాలను చేస్తున్నారు. త్వరలోనే ఇవి పట్టాలెక్కనున్నాయి. ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి నవలలు రీమిక్స్ చేసి హిట్ సంపాదించగా ఎక్కువగా డైరెక్టర్ సినిమాలను చేసి హిట్ లు అందుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: