మా అసోసియేషన్ లో ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవి ఎక్కడికి దారితీస్తాయో అన్న సంశయం అందరిలో నెలకొంది. ఒక ప్యానెల్ సభ్యులు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేస్తే మరొక ప్యానెల్ సభ్యులు తెల్లారి ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ప్రకాష్ రాజ్ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి తమ ప్యానెల్ నుంచి గెలిచిన వారందరం ఆ పదవులకు రాజీనామా చేస్తున్నాం అని చెప్పి ఒక్కసారిగా టాలీవుడ్ లో సంచలనం రేకెత్తించారు.

అంతేకాదు గెలిచిన సభ్యులు అందరూ కూడా ఒక్కొక్కరుగా మాట్లాడి వారి వారి ఆవేదనను వెళ్ళబుచ్చు కున్నారు. మోహన్ బాబు నిరంకుశత్వాన్ని అహంకారాన్ని చెబుతూ ఆయన పై దుమ్మెత్తి పోశారు ఈ సభ్యులు. పచ్చి బూతులు తిడుతూ మమ్మల్ని ఎంతగానో అవమానించారని కన్నీళ్లు పెట్టుకున్నారు. వందల మందిలో నన్ను నా కుటుంబ సభ్యులను తిడుతూ నన్ను దారుణంగా అవమానించాడు మోహన్ బాబు అని సీనియర్ నటుడు బెనర్జీ కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడ ఉన్న వారఅందరిని బాధించింది.

అయితే ప్రెస్ మీట్ లో మోహన్ బాబు కు ఎన్నో ప్రశ్నలు సవాళ్లుగా నిలిచాయి. వాటన్నిటికీ రామన్న చౌదరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో పెద్దరాయుడు తప్పనిసరిగా ఓ ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రకాష్ రాజు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఆవేశపరుడు అయినా మోహన్ బాబు ఎప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడో, ఎలా రియక్ట్ అవుతాడో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ సినిమా పరిశ్రమ వైపు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు ఒకేసారి పది మంది మూకుమ్మడిగా రాజీనామా చేయడం సంచలనం అవడంతో ఇప్పుడు మంచు ప్యానెల్ ఎంతో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: