
అప్పటికే దాసరి నారాయణ రావు డైరక్షన్ లో నీడ సినిమా తో తెరంగేట్రం చేశాడు రమేష్ బాబు. సామ్రాట్ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అమితాబ్ బేతాబ్ కి రీమేక్. ఈ సినిమా టైటిల్ విషయం లో కొంత గొడవ జరిగింది. బాలకృష్ణ సినిమాకు సామ్రాట్ అనే టైటిల్ పెట్టారు. అయితే ముందు రమేష్ బాబు సినిమాకు ఆ టైటిల్ రిజిస్టర్ చేయడంతో కోర్ట్ కి వెళ్లి మరి కృష్ణ సమ్రాట్ టైటిల్ సొంతం చేసుకున్నారు. అలా సమ్రాట్ టైటిల్ రమేష్ బాబుకి దక్కింది.
బాలకృష్ణ సినిమాకు సాహస సామ్రాట్ అని మార్చుకున్నారు. రమేష్ బాబు కోదండరామి రెడ్డి డైరక్షన్ లో వచ్చిన బజార్ రౌడీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాసరి నారాయణ రావు, జంధ్యాల, మురళి మోహన్ రావు, ఎస్.ఎస్ రవిచంద్ర లాంటి డైరక్టర్స్ తో రమేష్ బాబు సినిమాలు చేశారు. తన నట వారసుడిగా రమేష్ బాబుని స్టార్ ని చేద్దామని అనుకున్నారు కృష్ణ. కానీ రమేష్ బాబు కెరియర్ మధ్యలోనే ఆపేశారు. 1997లో కృష్ణ నటించిన ఎన్ కౌంటర్ సినిమాలో చివరిగా నటించారు రమేష్ బాబు.