తెలుగు సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంటున్న నటి ప్రగతి.. ఈమెను ఎక్కువగా ప్రగతి ఆంటీ అని పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండీగానే ఉంటోంది.

 తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తరచూ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తూ ఉంటుంది. దీంతో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నది.గత సంవత్సరం ఎక్కువగా ఈమె ఫిట్నేస్ పైనే దృష్టి పెట్టింది. అంతేకాకుండా అందుకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉండేది.
ఇప్పుడు తాజాగా హీరోయిన్ మెహరిన్ తో కలిసి ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. అంతేకాకుండా ప్రగతి ఆంటీ ఇలా రాస్తూ.. పనిచేసేచోట స్నేహబంధం ఉంటే చాలు అంతకంటే ఆనందం ఇంకేముంటుంది అంటు తెలియజేసింది. మెహరిన్ సినిమాలో కూతురు కాస్తా.. నిజ జీవితంలో కూతురిలా మారిపోయింది అని తెలియజేసింది ప్రగతి.


ఇక ఎఫ్ 2 చిత్రంలో వీరిద్దరూ కలిసి తల్లి కూతురు గా నటించారు. ఇక ఆ బంధం అలాగే కొనసాగింది అని తెలియజేసింది. ఇప్పుడు ఎఫ్-3 లో కూడా ఇద్దరు కలిసి నటిస్తున్నారు. ఇక ప్రగతి కి మరొక హీరోయిన్ రెజీనా తో కూడా మంచి అనుబంధం ఉన్నది.ఈ విషయాన్ని తనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. రెజీనా షూటింగ్ సెట్లో వచ్చిందంటే చాలు అమ్మ అంటూ వచ్చి హత్తుకునేది అని తెలియజేసింది ప్రగతి. ఇక అంతే కాకుండా హీరోయిన్ ఇలియానాకు కూడా మంచి సంబంధం ఉన్నట్లుగా తెలియజేసింది. ప్రగతి అంటే ఎక్కువగా తల్లి పాత్రలలో నే నటిస్తోంది. ప్రస్తుతం తన చేతిలో ఎన్నో సినిమాలతో బిజీగా గడుపుతోంది. ప్రగతి ఏదైనా సినిమాలో నటిస్తోంది అంటే ఆ సినిమాలో కచ్చితంగా కామెడీ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆమె కు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: