మలయాళం బ్యూటీ మీరాజాస్మిన్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. మొదటగా" అమ్మాయి బాగుంది" సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత.. గుడుంబా శంకర్, భద్ర తదితర సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాలలో నటించినప్పటికీ ఈమెకు పెద్దగా సక్సెస్ రాలేదు. అందంతో పాటు తెలుగు అమ్మాయిల కనిపించడంతో ఈమెకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. నటిగా మాత్రం ఎక్కువగా తన మాతృభాష అయిన మలయాళంలో నటించినది. ఆ తర్వాత కోలీవుడ్లో కూడా కొన్ని చిత్రాలలో నటించింది. ఈమె చివరి గా 2014 వరకు సినిమాలలో నటించినట్లు తెలుస్తుంది.


ఆ తర్వాత అడపదడప  చిత్రాల్లో నటించినప్పటికీ ఈమె కెరీర్ పరంగా నిలదోకోలేకపోవడంతో వివాహం చేసుకొని అత్తారింటికి వెళ్లి పోయింది. ఇక ఈమె భర్త పేరు అనిల్ జాన్. ఆ తరువాత ఈమె ఇంటికే పరిమితం అయ్యింది. అయితే సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా యాక్టివ్ వుండేది. కాని ఇటీవల కాలంలో తన ఇంస్టాగ్రామ్ గారి అభిమానులకు బాగా దగ్గరలో ఉంటూ సరికొత్త ఫోటోలు షేర్ చేస్తూ ఉంటోంది. వివాహం ముందు కన్నా చాలా అందంగా కనిపిస్తూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది ఈ ముద్దుగుమ్మ.అయితే చాలా కాలం పాటు నటిగా అదే అందంతో కొనసాగినప్పటికీ. ప్రస్తుతం షేర్ చేసిన తన ఫోటోలను చూస్తే యువ హీరోయిన్లకి పోటీ ఇచ్చే లాగా తయారయింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం యువతకు ఎలా ఉంటే నచ్చుతారో ఆ విధంగ అయినట్లు కనిపిస్తోంది మీరా జాస్మిన్. ఇక ఈ పోస్టులకు" డ్రీమీ కైండ్ ఆఫ్ డిలైట్ " అన్న క్యాప్షన్ తో పోస్టు చేసినది. ప్రస్తుతం ఈ ఫోటో మీకు చాలా వైరల్ గా మారుతున్నది. మీరాజాస్మిన్ మళ్లీ కం బ్యాక్ అవుతున్నట్లు తెలుస్తోంది. బోయపాటి శీను డైరెక్షన్ లో ఒక సినిమాలో రీఎంట్రీ ఇవ్వబోతోంది అన్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: