టాలీవుడ్ అగ్ర హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి బాహుబలి తర్వాత సరైన హిట్టు పడలేదు. డార్లింగ్ నటించిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతుల్లో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అందులో సలార్, ప్రాజెక్ట్ K లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. బాహుబలి రేంజ్ హైప్ తో వస్తున్న సినిమా మాత్రం 'ప్రాజెక్ట్ కే' అని చెప్పాలి. అందుకే సినిమాపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా కోసం పెడుతున్న బడ్జెట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రాజెక్టు కే సినిమా బడ్జెట్ 500 కోట్లు అని తెలుస్తోంది. నాగ్ అశ్విన్ ప్రాజెక్టు కే ని సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ మూవీ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం గ్రాఫిక్స్ వర్క్, సిజి వర్క్ చాలా వరకు అవసరం అవుతుంది. అందుకే ఈ సినిమాకి 500 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట. అంతేకాదు కంటెంట్ ను బట్టి బడ్జెట్ను ఇంకా పెంచే అవకాశాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

వీళ్ళతోపాటు తాజాగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ 70 శాతానికి పైగా పూర్తయినట్లు సమాచారం. కేవలం ఇంకా 30% షూటింగ్ మాత్రమే మిగిలింది. ఈ సినిమాని జనవరి 12 2024న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంటే సినిమా విడుదల కి 11 నెలల సమయం ఉంది. ఈ లోపు మిగతా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ ఇలా అన్ని పూర్తి చేసుకొని సంక్రాంతి బరిలో దిగడానికి డార్లింగ్ ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. తెలుగుతోపాటు హిందీ, తమిళం,మలయాళ ,కన్నడ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతమందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు సలార్, స్పిరిట్, రాజా డీలక్స్ వంటి వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు ప్రభాస్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: