తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరో లలో ఒకరు అయినటు వంటి నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే నిఖిల్ పోయిన సంవత్సరం రెండు మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అందులో మొదటగా నిఖిల్ కార్తికేయ 2 మూవీ తో ప్రేక్షకులను పలకరించగా ... ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ తో నిఖిల్ కు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు కూడా దక్కాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 కోట్లకు పైగా కలెక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయం సాధించింది. ఇలా కార్తికేయ 2 మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న నిఖిల్ ఆ తర్వాత 18 పేజెస్ అనే మూవీ లో హీరో గా నటించాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు.

ఇది ఇలా ఉంటే కార్తికేయ 2 మూవీ తర్వాత నిఖిల్ ... అనుపమ కాంబినేషన్ లో రూపొందిన మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 18 పేజెస్ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 10.30 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ భారీలోకి దిగింది. ఇలా భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ మూవీ ఫైనల్ రన్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా 11.83 కోట్ల షేర్ ... 23.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో ఈ మూవీ కి 0.83 కోట్ల లాభాలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: