ప్రభాస్  చేస్తున్న సినిమాలకు భారీ డిమాండ్ అయితే ఉంది.. ఈయన సినిమా అంటే నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ పెట్టడానికి వెనుకాడరు ..

బాహుబలి  సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుని ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం రేసులో వెనక్కి నెట్టాడు ప్రభాస్. మరి ఈ సినిమా తర్వాత ఒకేసారి ఐదారు పాన్ ఇండియన్ సినిమాలను కూడా లైన్లో పెట్టాడు.

ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో 'ఆదిపురుష్' కూడా ఒకటి.. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఎన్నో అంచనాలు కూడా ఏర్పడ్డాయి.. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు.. రామాయణం తెరకెక్కించడం కోసం బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టి సిరీస్ సంస్థ దాదాపు 500 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తుంది.. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి నటిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటించింది..

అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.. సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడటా.మంచి అంచనాలు పెరిగిన సమయం లోనే టీజర్ వచ్చి ఈ సినిమాపై ఆడియెన్స్ లో నిరాశ కలిగేలా చేసిందని తెలుస్తుంది... అప్పటి నుండి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఓం రౌత్ పై కోపం గా ఉన్నారు. దీంతో విడుదల కూడా వాయిదా పడింది. ఇక కొత్త విడుదల తేదిని ను జూన్ 16కు మార్చారు. మరి విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారటా.. అయితే మేకర్స్ నుండి ఎలాంటి అప్డేట్ లేకపోవడం తో ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తూ కంగారు కూడా పడుతున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రమోషన్స్ శ్రీ రామనవమి రోజు నుండి స్టార్ట్ చేయనున్నట్టుగా సమాచారం.. అదిరే అప్డేట్ తో రాబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: