సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా మార్చుకుని తనకు వచ్చిన సమస్యలన్నిటినీ దాటుకుని సినిమాలు చేస్తుంది. పక్కాగా చెప్పాలంటే ఏ హీరోయిన్ కు రానటువంటి సమస్యలు సమంతను పలుకరించాయి. స్టార్ ఫ్యామిలీ ఇంటికి కోడలి గా వెళ్లి ఆ తర్వాత డైవర్స్ తీసుకుని ఆ తర్వాత ఏదో అన్ హెల్తీ తో బాధ పడి ఫైనల్ గా మళ్లీ సినిమాలు చేస్తుంది సమంత. తన జీవితంలో ఎదురైన సవాళ్లను దాటుకుంటూ సమంత రియల్ లైఫ్ లో చాలా సినిమాలనే చేసిందని చెప్పొచ్చు. అందుకే ఆమె సెలబ్రిటీస్ కి చాలా మందికి స్పూర్తిగా నిలిచింది.

శాకుంతలం సినిమా రిజల్ట్ సమంతకి షాక్ ఇవ్వగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా చేస్తుంది సమంత ఆ సినిమాలో విజయ్ లవర్ గా సమంత మరో క్రేజీ లవ్ స్టోరీ తో వస్తుంది. ఈ సినిమా తప్పకుండా సమంతకు మంచి బూస్టింగ్ ఇస్తుందని అంటున్నారు. అంతేకాదు ఇక మీదత తాను యువ హీరోల సరసన నటించేందుకు కూడా సై అనేస్తుందట అమ్మడు. ఈ క్రమంలోనే సిద్ధు జొన్నలగడ్డ తో సినిమా కు సైన్ చేసినట్టు టాక్.

లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. నిజంగానే సమంత సిద్ధు  సినిమాకు ఓకే చెప్పిందా టిల్లు తో సమంత రొమాన్స్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి. చూస్తుంటే సమంత ఈ సమస్యలన్నీ దాటుకుని మళ్లీ కెరీర్ మొదలు పెట్టినట్టు అనిపిస్తుంది. సమంత యువ హీరోలతో జత కట్టడం మొదలైతే మాత్రం ఆమె కెరీర్ మళ్లీ సూపర్ స్వింగ్ లో ఉంటుందని చెప్పొచ్చు. నందిని రెడ్డి డైరెక్షన్ లో సినిమా అంటే సమంతకు మంచి పాత్ర దక్కినట్టే.. మరి ఈ సినిమా కు సంబంధించిన అప్డేట్స్ త్వరలో తెలుస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: