నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఎవరు సినిమాలతో వారు బిజీగా గడుపుతున్నారు. ఈ మధ్యకాలంలో నాగచైతన్య కస్టడీ సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. సమంత కూడా శాకుంతలం సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. గతంలో మజిలీ సినిమా టైంలో డైరెక్టర్ నందిని రెడ్డి నాగచైతన్య మరియు సమంత ఒక సినిమా తీస్తాను అని వారికి చెప్పిందట. దీంతో నందిని రెడ్డి వారిద్దరికీ కదని కూడా చెప్పిందట. దీంతో నాగచైతన్య సమంత కూడా ఆ సినిమా కథ విని ఓకే చేశారట. కానీ ఈ సినిమా అనుకున్న సమయానికి నాగచైతన్య సమంత ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. 

విడాకుల తర్వాత నందిని రెడ్డి వారిద్దరి దగ్గరికి వెళ్లి సినిమా విషయం చెప్పగానే వారిద్దరూ ఈ సినిమాలో నటించిన ఒప్పుకోలేదట. దీంతో ఈ ప్రాజెక్టు పక్కన పడింది. కానీ ప్రస్తుతం నందిని రెడ్డి సంతోష్ శోభన్ హీరోగా మంచి శకునాలే సినిమాని తెరకెక్కించింది. సంతోష్ నటించిన ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.దీంతో సమంతపై ఆశలు పెట్టుకుని ఉంది నందిని రెడ్డి. ఎలాగైనా సమంతతో ఆ సినిమాని చేయాలని భావిస్తోంది ఆమె. కానీ ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే నాగచైతన్య ప్లేస్ లో ఏ హీరోని తీసుకోవాలి అన్న ఆలోచనలో పడింది నందిని.ఈ నేపద్యంలోనే సమంత హీరోయిన్గా మరొక యంగ్ హీరోని నాగచైతన్య ప్లేస్ లో తీసుకోవాలని ఫిక్స్ అయింది నందిని రెడ్డి.

సమంతకి ఈ విషయం చెప్పిన తర్వాత ఆ హీరో ని ఓకే చేసిందట .త్వరలోనే ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతుంది. ఇక ఆ సినిమాలో నాగచైతన్య ప్లేస్ లో రాబోయే ఆ హీరో మరెవరో కాదు సిద్దు జొన్నలగడ్డ. గత కొంతకాలంగా వీరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఆ వార్తలు నిజమా అబద్దమా అన్నది తెలియదు. కానీ నందిని రెడ్డిని మాత్రం నిజంగానే వీరిద్దరితో కలిసి తన నెక్స్ట్ సినిమాని తీయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏదైనాప్పటికీ నాగచైతన్య పై రివెంజ్ తీర్చుకోడానికి సమంత ఈ హీరోతో సినిమా చేస్తుంది ఉన్న కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: