టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాహుబలి సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రభాస్ రానా ఈ సినిమాలో ఎంత అద్భుతంగా నటించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్గా అనుష్క మరియు తమన్నా నటించిన ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. అయితే అప్పట్లో ఈ సినిమాని నిర్మించడం నిర్మాతలకు ఒక పెద్ద తలనొప్పిగా మారిందన్న వార్తలు సైతం వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంపై రానా స్పందించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు..

బాహుబలి సినిమాని నిర్మించడం కోసం ఆర్కా మీడియా వారు చాలా రిస్క్ తీసుకున్నట్లుగా తెలియజేశారు రానా. అంతేకాదు ఈ సినిమాని నిర్మించే సమయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని నిజంగా నిర్మాతలు ఈ సినిమాని నిర్మించే సమయంలో చాలా ఆర్థిక ఒత్తిడికి లోనయ్యారని తెలియజేశాడు రానా. ఈ క్రమంలోనే బాహుబలి సినిమాను తీయడానికి అప్పుగా తీసుకున్న డబ్బు గురించి కూడా వెల్లడించాడు రానా. అయితే ఈ సినిమాకి 100 కోట్లు బ్యాంకు నుండి అధిక వడ్డీ కి తీసుకువచ్చారని చెప్పాడు. మూడు నాలుగు ఏళ్ల క్రితం సినిమాలోకి పెట్టుబడిగా పెట్టిన డబ్బును నిర్మాతలు ఇల్లు ఆస్తి బ్యాంకుల కు తాకట్టు పెట్టి వడ్డీలను కట్టారని తెలిపాడు.

దాదాపుగా 28 శాతం వరకు వడ్డీ చెల్లించినట్లుగా చెప్పాడు. అయితే ఈ సినిమా కోసం దాదాపుగా 300 నుండి 400 కోట్లను బ్యాంకు నుండి అప్పుగా తెచ్చారని వెల్లడించాడు రానా. ముఖ్యంగా మొదటి భాగం తీసేటప్పుడు చాలా కష్టమైందని తెలుగులో అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమా కంటే రెందు రేట్ల అదిగా ఖర్చు చేశామని చెప్పాడు రానా. ఎంత సంపాదించారో సినిమా ద్వారా ఎంత లాభం వచ్చింది అన్నదాన్ని లెక్క వేయడం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చాడు రానా...!!

మరింత సమాచారం తెలుసుకోండి: