సంక్రాంతి రేస్ కు రాబోతున్న ‘అల వైకుంఠ పురములో’ మూవీ ఒకనాటి ఎన్టీఆర్ ‘ఇంటిగుట్టు’ మూవీకి స్ఫూర్తి అంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా ఈ మూవీలోని కొన్ని సీన్స్ ఒక మళయాళ సినిమా సీన్స్ ను యధాతధంగా దించేసారు అంటూ ఇప్పుడు ఒక కొత్త ప్రచారం మొదలైంది. 

మళయాళంలో దిలీప్ మమతా మోహన్ దాస్ హీరోహీరోయిన్లుగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ‘మై బాస్’ మూవీలోని సీన్స్ ‘అల వైకుంఠపురములో’ కనిపిస్తాయి అని అంటున్నారు.  ఇందులో దిలీప్ ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా అతడి బాస్ గా మమతా మోహన్ దాస్ కనిపిస్తుంది. అలాగే ‘అల వైకుంఠపురములో’ కూడా బన్నీకి బాస్ గా పూజా హెగ్డే కనిపిస్తుంది. 

వాస్తవానికి ‘మై బాస్’ మూవీ అమెరికన్ మూవీ ది ప్రపోజల్ కు దగ్గరగా పోలి ఉంటుంది. దీనితో ‘అల వైకుంఠపురములో’ కొంత ‘ఇంటిగుట్టు’ మరికొంత ‘మై బాస్’ సినిమాల మిక్స్ అయి ఉంటాయ అంటూ ఇప్పుడు త్రివిక్రమ్ పై జోక్స్ పడుతున్నాయి. త్రివిక్రమ్ విదేశీ సినిమాల నుండి స్ఫూర్తి పొంది సినిమాలు తీయడం కొత్త కాదు ‘లార్గోవించ్’ సినిమాను ‘అజ్ఞాతవాసి’ గా మారిస్తే ‘మీనా’ మూవీని ‘అ ఆ’ గా చూపెట్టి అనవసరపు విమర్శలు ఎదుర్కున్నాడు. 

దీనితో త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ అంతా తన క్రియేటివిటీని వాడుతాడు అనుకుంటే ఇప్పుడు ఒక పాత తెలుగు సినిమా మరో మళయాళ సినిమాలను కలిపి త్రివిక్రమ్ బన్నీ పై ప్రయోగం చేస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈవార్తలు ఇలా లీక్ అవ్వడంతో ‘అల వైకుంఠపురములో’ మూవీని భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లు తెగ టెన్షన్ పడిపోతున్నట్లు సమాచారం. ఈ కాపీ వార్తలే నిజం అయితే ఇక త్రివిక్రమ్ ఎప్పటికీ మారడా అన్న సందేహాలు రావడమే కాకుండా అతడి క్రియేటివిటీ పై నమ్మకం పోతుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: