టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉన్న క్రేజ్ మరియు ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరో హీరో తెలియదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చిరంజీవి తమ్ముడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా స్టార్టింగ్ నుండి వరుసపెట్టి విజయాలు సాధించారు. అతి తక్కువ కాలంలోనే అప్పట్లోనే టాలీవుడ్ బాక్సాఫీస్ ని శాసిస్తున్న చిరంజీవికి పోటీ ఇచ్చే రకంగా ఇండస్ట్రీలో సక్సెస్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు.

 

చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు మరియు హీరోలు ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు అభిమానులు అంటే పవన్ కళ్యాణ్ గారికి భక్తులు ఉంటారని వీరాభిమానులు ఎక్కువని అంతేకాకుండా హీరోల్లో కూడా ఎక్కువమంది పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడతారని చెబుతుంటారు. కేవలం ఆయన సినిమాలో నటించే నటన మాత్రమే కాకుండా ఆయన వ్యక్తిత్వం అని చెబుతారు. రాజకీయ రంగంలో పెద్దగా రాణించలేక పోయినా గాని సినిమారంగంలో ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గలేదు అని ఆయనకున్న సినిమాల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చెక్కు చదర లేదని ఇండస్ట్రీకి చెందిన వారు అంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలో చాలా సన్నివేశాలు ఇప్పటికీ కూడా చూడ బుద్ధి అవుతాయని ఏమాత్రం బోర్ కొట్టని సన్నివేశాలు పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో చేయడం జరిగిందని చెబుతున్నారు.

 

పవన్ కళ్యాణ్ నటించిన అన్ని సినిమాల సన్నివేశాలలో కంటే కరుణాకరన్ దర్శకత్వంలో నటించిన ‘తొలిప్రేమ’ సినిమాలో చిచ్చుబుడ్డి సీన్ ఎప్పటికీ హైలెట్ అని చాలామంది చెబుతారు. ఆ సన్నివేశంలో హీరోయిన్ ని చూపించే విధానం సినిమాకే హైలెట్ అని ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అల్టిమేట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా సందర్భాలలో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోలు అలాగే మెగా హీరోలు కూడా  తొలిప్రేమ‌లోని చిచ్చుబుడ్డి సీన్ తమ సినిమాల్లో పెట్టుకొని హిట్టు కొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. టోటల్ గా పవన్ నటించిన అన్ని సన్నివేశాలలో కంటే తొలిప్రేమ‌లోని చిచ్చుబుడ్డి సీన్ కి మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: