ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రభావంతో అన్ని రంగాలతోపాటు ఇటు సినిమా రంగం కూడా కుదేలు అవుతోంది. ముఖ్యంగా అంతా లాక్ డౌన్ అవ్వడంతో షూటింగ్స్.. సినిమా రిలీజ్ లు ఫిల్మ్స్ కు సంబంధించిన అన్ని యాక్టివిటీస్ ఆగిపోవడంతో ఇండస్ట్రీ పై ఈ ప్రభావం గట్టిగానే చూపిస్తోంది. లాక్ డౌన్ తరువాత కూడా ఇండస్ట్రీ అంత త్వరగా కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. లాక్ డౌన్ ప్రభావం ప్రత్యక్షంగా పరోక్షంగా సినిమాను నమ్ముకున్న 24 విభాగాలలో 50 వేల మంది పైగానే  గట్టిగా ప్రభావం  చూపించే అవకాశం కనిపిస్తోంది.

 

కరోనా ప్రభావంతో.. సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయించడానికి మాల్స్ తో పాటు థియేటర్స్ కూడా మూతపడిపోయాయి.. దాంతో రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాల పరిస్థితి కుడితో పడ్డ ఎలుక మాధిరిగా మారిపోయింది. ముఖ్యంగా ఏప్రిల్ 2నుంచి వరుసగా మే ఎండిగ్ వరకు సమ్మర్ సీజన్ కోసం సినిమాలు ముస్తాబై కూర్చున్నాయి.నానీ వి, అనుష్క నిశ్శబ్ధం, నాగచైతన్య లవ్ స్టోరీ.. రానా అరణ్య,లాంటి సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్స్ కూడా కంప్లీట్ చేసుకుని రిలీజ్ చేయాలని అనుకున్నాయి.. కాని పరిస్థితి ఒక్క సారిగా తారుమారు అయ్యింది.

 

లాక్ డౌన్ పోడిగించే అవకాశం ఉండటంతో ఈ నెలలోసినిమాలేవి రిలీజ్ అయ్యే అవకాశం లేదు. ఇక  ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు మూవీ మేకర్స్.. సమ్మర్ కోసం రెడీ అవుతున్న సాయి తేజ్  సోలో బ్రతుకే సో బెటరు, రామ్ రెడ్, రవితేజ క్రాక్, శర్వానంద్ శ్రీకారం, అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు ఏప్రిల్ ,మే నెల బరిలోంచి తప్పుకుని జూన్.. జులై వైపు చూస్తున్నాయి. అయితే ఇప్పుడున్న సినిమాలన్నీ ఒకే సారి జూన్..జులైలో రిలీజ్ అయితే.. ఇంకా అప్పటికి కూడా ఆడియన్స్ థియేటర్లకు వచ్చే పరిస్థితి ఉంటుందో ఉండదో తెలియకపోవడంతో కలెక్షన్స్ పరంగా ఈ సినిమాలు చాలా నష్టపోవల్సి వస్తుంది.  అందుకే మా సినిమాలు, వాటి కలెక్షన్ల పరిస్తితేంట్రా బాబూ అని తల పట్టుకుంటున్నారు హీరోలు.

మరింత సమాచారం తెలుసుకోండి: