బిగ్ బాస్ సీజన్ 4లో ఆరవ వారం 9 మంది నామినేషన్స్ లో ఉండగా శనివారం ముగ్గురు హౌజ్ మేట్స్ ను సేవ్ చేశారు హోస్ట్ నాగార్జున. ఇక ఆదివారం ఎపిసోడ్ లో ఒకరిని ఎలిమినేట్ చేస్తారని తెలుస్తుంది. అయితే మిగిలిన ఆరుగురిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంతే కుమార్ సాయి అని తెలుస్తుంది. హౌజ్ లో మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన కుమార్ సాయి హౌజ్ లో ఎవరితో కలవకుండా ఒంటరిగా ఆడుతున్నాడు. ఇన్నిరోజుల ఆటలో తను ది బెస్ట్ అనిపించుకున్న సందర్భాలు ఒకటి రెండు మాత్రమే.

ఇక ఏదైనా విషయంపై తనతో మాట్లాడితే సంబంధం లేకుండా వేరే వాటిని ప్రస్థావిస్తాడు. అంతేకాదు తప్పుని ఎప్పుడు ఒప్పుకోడు. అందుకే హౌజ్ లో అందరు అతన్ని దూరం పెట్టారు. అయినా సరే సోలో ఆటగాడిగా ఎవరితో ఎలాంటి రిలేషన్ షిప్ లేకుండా తన వరకు ప్రయత్నిస్తూ వస్తున్నాడు కుమార్ సాయి. దాదాపు తను వచ్చిన వారం నుండి కెప్టెన్ అయిన వారం తప్ప మిగతా అన్ని వారాలు కుమార్ సాయి ఎలిమినేట్ అవుతూ వచ్చాడు. ఐదువారాల్లో తన ఆట తీరు అందరిని అలరించింది.    

ఇక ఈ వారం ఎలిమినేషన్ లో అతనే హౌజ్ నుండి బయటకు వెళ్తున్నాడని తెలుస్తుంది. హౌజ్ లో ఎవరికి సపోర్ట్ గా మాట్లాడకుండా సేఫ్ గేం ఆడకుండా ఉంటున్న కుమార్ సాయి మరో వారం ఉంటే తప్పకుండా అతను టాప్ 5 లో ఉండే అవకాశం ఉండేది. ఏదైనా ఆడియెన్స్ ఓట్ల ప్రకారమే బిగ్ బాస్ ఎలిమినేషన్ జరుగుతుంది కాబట్టి కుమార్ సాయి హౌజ్ లో ఇక చాలనుకున్న ఆడియెన అతన్ని బయటకు పంపిస్తున్నారు.                           

మరింత సమాచారం తెలుసుకోండి: