మెగా ఫ్యామిలీ లో  రీమిక్స్ హవా నడుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి వరుసగా రీమిక్స్ సినిమాలకు కమిట్ అవుతున్నారు. అలాగే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్య బాటలోనే వరుసగా రీమిక్స్ సినిమాలను ఒప్పుకుంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి రీమిక్స్ సినిమాతోనే ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో దాదాపుగా వంద కోట్లకు పైనే కొల్లగొట్టి తన ఫాలోయింగ్ ఏమాత్రము తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ కత్తి సినిమాకి రీమిక్స్ అని తెలిసిందే.

 అదేంటోగాని పవన్ కళ్యాణ్ కూడా రీమిక్స్ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నాడు బాలీవుడ్లోనూ కోలీవుడ్లోనూ సూపర్ హిట్ అయినా పింక్ సినిమా ని వఖీల్ సాబ్ గా రీమేక్ చేస్తున్నాడు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాలకే పరిమితమైన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూడడంతో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొస్తున్నాడు. అలాగే అన్నయ్య చిరంజీవి కూడా తనదైన స్టైల్లో 65 వయసులో కూడా వరుసగా సినిమాలకు కమీట్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూన్నాడు. అయితే వీరిద్దరూ కమిటీనా సినిమాలలో దాదాపుగా ఎక్కువగా రీమిక్స్ సినిమాలో ఉండటం గమనార్హం.

 చిరంజీవి  మలయాళంలో సూపర్ హిట్ అయినా లూసీఫర్ ను తెలుగులోకి రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు అలాగే తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం రీమిక్స్ లో కూడా నటిస్తున్నాడు. ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ వద్దకు వస్తే పింక్ రీమిక్స్ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నాడు అలాగే మలయాళంలో లో బ్లాక్ బ్లాస్టర్ అయినా అయ్యప్పనం కోషియన్ రీమిక్స్ లో నటిస్తున్నాడు ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అప్డేట్ ను సితార ఎంటర్టైన్మెంట్ దసరా సందర్భంగా విడుదల చేసింది. మొత్తానికి అన్నా తమ్ముడు వరుసగా రీమిక్స్ సినిమాలకు కమిట్ అవుతూ రీమిక్స్ కింగ్స్ గా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: