రాఘవేంద్రరావు అంటే ముందుగా పూలు పళ్లు గుర్తుకొస్తాయి. హీరోలతో ముద్దుగుమ్మలపై.. పూలు పళ్లు వేయించిన దర్శకేంద్రుడు.. ఇక నుంచి ఆయనే వేయడానికి రెడీ అవుతున్నాడు. హీరోల గురి తప్పడంతో ఆయనే రంగంలోకి దిగాడా? రాఘవేంద్రరావులో వచ్చిన ఈ మర్పేమిటి? అనే సందేహం అందరిలోనూ కలుగక మానదు.

రాఘవేంద్రరావు 100 సినిమాలు తీసినా.. ఆయన మాట ఎలా ఉంటుందో తెలియదు. ఆయన మాటల మనిషి కాదు.. చేతల మనిషి అన్నారు. ఎట్టకేలకు..ఆయన అనుభవాలు పంచుకోవడానికి.. ఈ జనరేషన్‌ డైరెక్టర్స్‌కు ఉపయోగపడడం కోసం.. సౌందర్యలహరితో మౌనం వీడారు దర్శకేంద్రుడు. ప్రస్తుతం ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో పెళ్లిసందడి రూపొందుతోంది. గౌరి డైరెక్టర్‌ చేసే ఈ మూవీలో శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌ హీరోగా నటిస్తున్నాడు.

ఎన్టీఆర్‌ నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌ వరకు.. ఏఎన్నార్‌ నుంచి నాగార్జున వరకు స్టార్స్ అందరినీ డైరెక్ట్‌ చేశారు రాఘవేంద్రరావు. మహేశ్‌, బన్నీని హీరోలుగా పరిచయం చేసిందీ ఈయనే. మూడు తరాల హీరోలను  డైరెక్ట్‌ చేసిన రాఘవేంద్రరావు... నటుడిగా మారుతున్నారు. జనార్ధన మహర్షి డైరెక్ట్‌ చేసే మూవీలో  రాఘవేంద్రరావు కీ రోల్‌ పోషిస్తున్నారని.. త్వరలో ఎనౌన్స్‌ చేస్తారని తెలిసింది.

రాఘవేంద్రరావు నటించే సినిమాలో సమంత, శ్రియ, రమ్యకృష్ణ నటిస్తున్నారు. రమ్యకృష్ణకు స్టార్‌డమ్‌ తీసుకొచ్చిన దర్శకుడు ఆమెతో కలిసి నటిస్తున్నారు. ఇప్పటివరకు హీరోలతో పూలు..పళ్లు విసిరించిన 78 ఏళ్ల దర్శకేంద్రుడు...  పూలు విసురుతారా? అసలు ఈ వయసులో యాక్టింగ్‌ చేయాలని ఎందుకు అనిపించింది? అసలు ఆయన యాక్టింగ్‌ చేస్తున్నారన్న వార్త ఆడియన్స్‌కే కాదు.. టాలీవుడ్‌కు కూడా పెద్ద షాకే.

మొత్తానికి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు నటుడిగా మారుతున్నాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. జనార్ధన మహర్షి దర్శకత్వంలో ఆయన నటిస్తున్నట్టు గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయే కానీ అందులో ఏ మాత్రం నిజమో అర్థం కావడం లేదు. 100 సినిమాలు డైరెక్ట్‌ చేసినా నోరు కూడా ఎత్తని రాఘవేంద్రరావు సౌందర్యలహరితో మౌనం వీడి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.









మరింత సమాచారం తెలుసుకోండి: