ప్రకాష్ రాజ్..ఒక అనాథ అయినా తల్లికి పుట్టిన వర్సటైల్ యాక్టర్. చిన్న తనం నుండి ఎన్నో కష్టాలు పడుతూ అంచెలంచెలుగా కెరీర్ లో నిలబడి పది మందికి సహాయం చేస్తున్న గొప్ప నటుడు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయాలనుకుంటున్నాడు. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి, విలన్ గా, హీరో గా, తండ్రిగా మరియు తాత గా ఇలా ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోగల సత్తా ఉన్నవాడు. సినిమా జీవితం మరియు సోషల్ లైఫ్ ఎలా ఉన్న అయన వ్యక్తి గత జీవితంలో మాత్రం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ముగ్గురు పిల్లలు పుట్టాక మొదటి భార్య లలిత కుమారి కి విడాకులు ఇచ్చి మరొక పెళ్లి చేసుకోవడం వల్ల మీడియాలో అయన గురించి చాల వార్తలు పుట్టుకొచ్చాయి.

వాస్తవానికి ప్రకాష్ రాజ్ మళ్ళి పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే. పోనీ వర్మ అనే బాలీవుడ్ అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు. అది కూడా ప్రేమ వివాహం, కానీ మొదటి భార్యతో విడాకుల వెనక మాత్రం కారణాలు వేరేలా ఉన్నాయ్. ప్రకాష్ రాజ్, లలిత కుమారి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు. అబ్బాయి పేరు సిద్దు, కాగా 2004 లో లలిత తన కొడుకుని ఇద్దరు కూతుళ్ళకు అప్పజెప్పి పని మీద బయటకు వెళ్లిందట. అప్పటికి అందరు చాలా చిన్న పిల్లలు కావడంతో మేడ పైన గాలి పటాలు ఎగరవేయాలనుకున్నారు. కానీ సిద్దు అలాగే పైకి చూస్తూ ఆడుకుంటూ వెళ్లి పైనుండి కింద పడి కన్ను మూసాడు. షూటింగ్స్ తో బిజీ గా ఉండే ప్రకాష్ రాజ్ భార్య  చూసుకుంటుంది అని నమ్మి వెళ్తే వచ్చేసరికి కొడుకు చనిపోవడంతో ఆయన చాలా రోజుల పాటు డిప్రెషన్లోకి వెళ్ళాడు. రాను రాను ఈ సంఘటన వల్ల భార్య భర్తల మధ్య విభేదాలు ఎక్కువ కావడంతో వారు విడాకులు తీసుకోవాల్సి వచ్చిది. ఆ తర్వాత పోనీ వర్మ ని పెళ్లి చేసుకొని మరొక కొడుకుకి జన్మ ఇచ్చాడు ప్రకాష్.

మరింత సమాచారం తెలుసుకోండి: