నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన మూవీ లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న మాస్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు.  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తనకంటూ ఒక సపరేట్  ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న బాలకృష్ణ తాను నటించిన ఎన్నో సినిమాలు కూడా 175 రోజుల వేడుకలు జరుపుకున్నాయి. అలా బాలకృష్ణ కెరియర్ లో 175 రోజులు వేడుకలు జరుపుకున్న సినిమాల గురించి తెలుసుకుందాం.

బాలకృష్ణ కెరియర్ లో భైరవ ద్వీపం 175 రోజుల వేడుకను జరుపుకుంది.

ఆదిత్య 369 మూవీ కూడా 175 రోజుల వేడుకలు జరుపుకుంది.
రౌడీ ఇన్ స్పెక్టర్ , ముద్దుల మామయ్య , ముద్దుల కృష్ణుడు ,  మంగమ్మగారి మనవడు ,  శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర , సమరసింహారెడ్డి ,  నరసింహనాయుడు , సింహ , లెజెండ్ సినిమాలు 175 రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శించబడ్డాయి. ఇది ఇలా ఉంటే తాజాగా బాలకృష్ణ నటించిన అఖండ సినిమా కూడా 175 రోజులు ఒక థియేటర్ లో ప్రదర్శించబడింది.  


బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ మూవీ లో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో పూర్ణ ఒక కీలక పాత్రలో నటించగా శ్రీకాంత్ ప్రతినాయకుడు పాత్రలో నటించాడు. ఈ మూవీ కి తమన్ సంగీతం సమకూర్చగా తమన్ ఈ సినిమాకు అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. విడుదలైన మొదటి రోజు నుండి బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకున్న అఖండ సినిమా చిలకలూరిపేటలోని ఒక థియేటర్ లో ఏకంగా 175 రోజుల పాటు ప్రదర్శించబడటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: