అభిమానులనే దేవుళ్ళు గా భావిస్తూ మన టాలీవుడ్ స్టార్ హీరోలు వారి కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. అయితే అలాంటి వారికి కష్టం వస్తే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడానికి మన హీరోలు సైతం ముందుకు వస్తూ ఉంటారు.స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు తన ఫ్యాన్స్ కి కష్టం వస్తే చాలు వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు. సొంత కుటుంబంలా వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. ఈమధ్య చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ వంటి వారు కూడా తమ అభిమానులకు కష్టం వస్తే మేమున్నామంటూ ధైర్యం చెబుతూ పలకరిస్తూ ఉన్నారు.


ఇటీవల ఓ అభిమాని ఐసియులో ఉన్నాడని తెలుసుకున్న ఎన్టీఆర్ వెంటనే అతడు ఉండే హాస్పిటల్ కి తన టీం ద్వారా తెలుసుకొని వీడియో కాల్ మాట్లాడి అతనికి ధైర్యాన్ని చెప్పారట. గత సంవత్సరం కూడ వీడియోకాల్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..ఎన్టీఆర్ గొప్ప మనస్సుని ప్రపంచానికి చాటిస్తోంది. తాజాగా ఇప్పుడు మరొకసారి ఇదే తరహాలో  తన గొప్ప మనసుని చాటుకుంటున్నారు ఎన్టీఆర్. జనార్దన్ అనే ఒక అభిమాని పరిస్థితి చాలా సీరియస్ గా ఉండటంతో తనని ఐసీయూలో ఉంచారు.


అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ సదరు హాస్పిటల్ కి తన టీమ్ ను పంపించి ఫోన్ ద్వారా అక్కడే ఆ యువకుడితో మాట్లాడి ఆరోగ్యం పైన ఆందోళన చెందవద్దని అతని తల్లితో మాట్లాడి ధైర్యాన్ని చెప్పారు. అధైర్య పడకుండా దేవుడిని నమ్మండి దేవుడు పైన భారం వేయండి మేమంతా ఉన్నాము త్వరలోనే క్షేమంగా నీ కుమారుడు తిరిగి వస్తారని ఎట్టి పరిస్థితిలో కూడా అధైర్య పడవద్దు అని తెలియజేశారు. తన అభిమాని తల్లికి ధైర్యం చెప్పడం జరిగింది అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చాలా వైరల్ గా మారుతూనే ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: