నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే అన్ స్తపబుల్ టాక్ షో మొదటి సీజన్ అద్భుతమైన విజయం సాధించడంతో కొన్ని రోజుల క్రితమే ఈ టాక్ షో కు సెకండ్ సీజన్ ను ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ ప్రారంభించింది. అందులో భాగంగా ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ 2 కు సంబంధించి కొన్ని ఎపిసోడ్ లు స్ట్రీమింగ్ కూడా అవుతున్నాయి . వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది . ఇది ఇలా ఉంటే తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 కు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ఆహా నిర్వాహక బృందం విడుదల చేసింది . అన్ స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్ కు రాబోయే గెస్ట్ లకు సంబంధించిన వివరాలను ఆహా నిర్వాహ బృందం తాజాగా ప్రకటించింది . 

ఆన్ స్టాపబుల్ సీజన్ 2 లోని తదుపరి ఎపిసోడ్ కు 100 కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించినటు వంటి దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మరియు అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి కోదండ రామి రెడ్డి అలాగే ఎన్నో సినిమాలను ఇప్పటివరకు నిర్మించిన అల్లు అరవింద్ మరియు సురేష్ బాబు లు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. తాజాగా ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రకటిస్తూ వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆహా నిర్వాహక బృందం విడుదల చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: