
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో కథానాయకగా నటిస్తున్న శృతిహాసన్.. "ది ఐ" అనే ఆంగ్ల చిత్రంలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. కెరియర్ ఆరంభంలో వరుస ఫ్లాప్ లను పలకరించినప్పుడు అందరూ ఐరన్ లెగ్ అని హేళన చేశారు. కానీ గబ్బర్ సింగ్ తో వచ్చి తన స్ట్రాటజీ చూపించి విజయ పతాకం ఎగురవేసింది . ఆ తర్వాత రేసుగుర్రం, ఎవడు వంటి సినిమాలు చేసిన ఈమె రవితేజతో బలుపు, క్రాక్.. మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమాలు చేసి మరిన్ని విజయాలను తన ఖాతాలో వేసుకుంది.
ప్రముఖ స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు అంతకుమించి సింగర్ కూడా.. తన తండ్రి కమలహాసన్ నటించిన ఈనాడు సినిమాకు ప్రచార గీతంలో గళం విప్పిన ఈమె ఆ తర్వాత రేసుగుర్రం, ఓ మై ఫ్రెండ్, ఆగడు, 3 వంటి సినిమాలలో కూడా తెలుగు పాటలు పాడి అందరినీ ఆకట్టుకుంది . అంతేకాదు కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ కు కంపోజర్ గా కూడా పనిచేసింది శృతిహాసన్. త్వరలోనే తాను ప్రేమించిన శాంతన్ హజారికాను వివాహం చేసుకోబోతోంది ఈ ముద్దుగుమ్మ శృతిహాసన్ విలక్షణమైన నటి మాత్రమే కాదు విజయ నాయిక అని కూడా చెప్పవచ్చు.