టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి నిఖిల్ పోయిన సంవత్సరం కార్తికేయ 2 అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల మంచి విజయం అందుకున్న కార్తికేయ మూవీ కి కొనసాగింపుగా రూపొందడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే టాక్ ను సొంతం చేసుకుంది.

దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్ లు కూడా దక్కాయి. ఈ మూవీ దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసి పోయిన సంవత్సరం బ్లాక్ బాస్టర్ మూవీ ల లిస్ట్ లో చేరిపోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఇప్పటి వరకు రెండు సార్లు బుల్లి తెరపై ప్రసారం అయింది. రెండు సార్లు కూడా ఈ మూవీ కి బుల్లి తెర ప్రేక్షకుల నుండి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది.

మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ సాటిలైట్ సంస్థలలో ఒకటి అయినటు వంటి జీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని మొదటి సారి జీ తెలుగు చానల్లో జీ సంస్థ ప్రసారం చేసింది. ఈ మూవీ కి మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 7.88 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. రెండవ సారి ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 3.43 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. ఇలా రెండు సార్లు కూడా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ "టి ఆర్ పి" ని ఈ మూవీ సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: