టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అందం, నటన ఉన్నప్పటికీ అదృష్టం కూడా కలిసి రావాలి. అదృష్టం లేకపోతే ఏ సినిమా కూడా విజయాన్ని అందుకోదు. అందం, నటన, అదృష్టం కలగలిపిన హీరోయిన్ సంయుక్త మీనన్ అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.


తమిళ, మలయాళ, తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది తెలుగులోనూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం బింబిసారా సినిమాలోను కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా చేసింది. ఆ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు లభించింది. 2023లో ధనుష్ సరసన హీరోయిన్ గా సార్ సినిమాలో నటించింది.


ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంయుక్త మీనన్ వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటు స్టార్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.... సంయుక్త మీనన్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ప్రముఖ సీనియర్ నటుడు నాజర్ తో కలిసి చేసిన కొన్ని బోల్డ్ సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. సంయుక్త మీనన్ ఇలాంటి సన్నివేశాలలో నటించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

2021 సంవత్సరంలో ఆమె చేసిన తమిళ ఫిల్మ్ ఎరిడా లోని కొన్ని కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ సినిమాలో సంయుక్త చాలా బోల్డ్ సన్నివేశాలలో నటించింది. సీనియర్ ఆర్టిస్ట్ తో ఇలా రొమాంటిక్ సీన్స్, బోల్డ్ సన్నివేశాలలో నటించడంతో అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తాత వయసులో ఉన్న నటుడితో ఇలా రొమాన్స్ చేయడం అవసరమా అంటూ నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ వార్తలపై సంయుక్త ఎలా స్పందిస్తుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: