ఈ మధ్యకాలంలో డార్లింగ్ ప్రభాస్ తన రూట్ మొత్తం మార్చేసుకున్నారు.  కేవలం హీరో గానే కాదు పలు  సినిమాలలో గెస్ట్ పాత్రలు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భారీ  బడ్జెట్ తో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ స్పెషల్ క్యారెక్టర్ల లో విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీ థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాకి సంబంధించి మోహన్ బాబు మంచు విష్ణు చాలా చాలా పక్కాగా ముందుకు వెళ్తున్నారు.  అయితే ఈ సినిమా విషయంలో ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటున్నారు. కాగా ప్రభాస్ కన్నప్ప సినిమాలో నటించిన విధంగానే మరొక తెలుగు సినిమాలో గెస్ట్ పాత్రలో మెరవబోతున్నాడు అంటూ బయటికి వచ్చింది .


సినిమా మరేంటో కాదు రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే మూవీనే.  రాజమౌళి - ప్రభాస్ ఫ్రెండ్షిప్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . వీళ్లిద్దరు  జాన్ జిగిడి ఫ్రెండ్షిప్ అనే చెప్పాలి.  వీళ్ళ కాంబోలో  వచ్చిన సినిమాలు అన్నీ కూడా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ . ఆ ఫ్రెండ్షిప్ ఆ చనువుతోనే ప్రభాస్ ని ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ కోసం చూస్ చేసుకున్నరట రాజమౌళి . గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ప్రభాస్ ఓపెన్ గానే రాజమౌళిని అడిగేసాడు . "ఏం డార్లింగ్ నా కోసం ఒక చిన్న గెస్ట్ రోల్ రాయకూడదు ..??"అంటూ ఆ కోరికను ఇప్పుడు ఇలా ఈ విధంగా తీర్చుకోబోతున్నాడు రాజమౌళి అంటూ మాట్లాడుతున్నారు .



మొత్తానికి చాలా ఏళ్ల తర్వాతనే ప్రభాస్ ని డైరెక్ట్  చేయబోతున్నాడు రాజమౌళి . చూద్దాం మరి ఏ రేంజ్ లో ఈ సినిమా హిట్ అవుతుందో అంటూ మాట్లాడుకుంటున్నారు అభిమానులు . అయితే మరి ఒక పక్క మాత్రం పెద్ద పెద్ద హీరోస్ ని ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో చూపించాలి అంటే రాజమౌళి..మా మహేష్ బాబును తక్కువ చేసి చూపించాడు కదా అంటూ మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రెసెంట్ రాజమౌళి - ప్రభాస్ - మహేష్ బాబుల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి.  ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రాన్ని చూస్ చూసుకున్నాడు రాజమౌళి . అంతే కాదు దాదాపు పది మంది హీరోయిన్లను ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో చూపించబోతున్నారట . ఇది ఒక బిగ్ సాహసం అనే చెప్పాలి ..సాహసాలు చేయడం వాటిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం రాజమౌళికి పెద్ద కొత్త విషయాలు కాదు అనుకోండి . కానీ రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయం  ఎంతవరకు కరెక్ట్ అనేది సినిమా రిలీజ్ అయితేనే తెలుస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: