20 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో సెట్ అవుతుంది అని ..ఈ సినిమాలో కామెడీ వేరే లెవెల్ లో మనం చూడబోతున్నామని సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వినిపించాయి.  త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ఓ సినిమాకి కమిట్ అయ్యాడు అని సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమా తర్వాత ఆయన నుంచి అభిమానులు ఎలాంటి మూవీ ని ఎక్స్పెక్ట్ చేశారో దానికి పర్ఫెక్ట్ స్టోరీ ఇది అని జనాలు బాగా మాట్లాడుకున్నారు . అయితే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక్కడే కాదు అని ఆయనతో పాటు రాం పోతినేని కూడా నటిస్తున్నాడు అని ఓ న్యూస్ బయటకు వచ్చింది.


గతంలో విక్టరీ వెంకటేష్ - రామ్ పోతినేని కలిసి మసాలా అనే సినిమాలో నటించారు . ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. ఇప్పుడు మరొకసారి వీళ్ళు ఇద్దరు కలిసి నటించబోతున్నారు . అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వం పై చాలా నమ్మకాలు పెట్టుకున్నారు జనాలు . ఒక నువ్వు నాకు నచ్చావ్.. ఒక మల్లీశ్వరి లాంటి మూవీలోని కామెడీ మళ్ళీ చూడబోతున్నాం అంటూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.  మొత్తానికి ఒక పాన్ ఇండియా హీరో రేంజ్ లో ఈ సినిమాకి పబ్లిసిటీ చేస్తున్నారు జనాలు. సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ..?



కానీ ఖచ్చితంగా రామ్ - త్రివిక్రమ్ - వెంకటేష్ కాంబో సెట్ అయితే మాత్రం అది మరొక బ్లాక్ బస్టర్ హిట్ కి దారి మళ్ళి న్నట్టే అంటున్నారు జనాలు. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు - అల్లు అర్జున్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమా సెట్స్ పై కి తీసుకురావాలి . కానీ అల్లు అర్జున్ ఎవరు ఊహించని విధంగా అట్లీకు ఛాన్స్ ఇవ్వడం పుష్ప సినిమా లాంటి తర్వాత అల్లు అర్జున్ కి కూడా పాన్ ఇండియా ఫిలిం పడడమే ఇంపార్టెంట్ అంటూ త్రివిక్రమ్ శ్రీనివాసురావు తప్పుకోవడం నిజంగా వాళ్ల ఫ్రెండ్షిప్ కి నిర్వచనం అని చెప్పాలి. ఇప్పూదు వెంకి-త్రివిక్రమ్-రామ్ పేర్లు మారు మ్రోగిపోతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: