23 మూవీ ట్రైలర్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మూవీ ట్రైలర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. సినిమా ట్రైలర్ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకునేలా కనిపిస్తుంది. ఈ సినిమా ఒక నిజ జీవిత కథను కళ్లకు కట్టినట్లు చూపిస్తుందని అనడంతో ఆశ్చర్య లేదు. ఈ సినిమాలో హీరోగా తేజ నటిస్తున్నాడు. హీరోయిన్ గా తన్మయి నటిస్తుంది. ఈ మూవీలో నటి ఝాన్సీ, నటుడు తాగుబోతు రమేష్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ రాజ్ రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 16న థియేటర్లలో విడుదల కానుంది.
 
అయితే ఈ సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించింది. 23 మూవీ గ్రామీణ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ మూవీ నిజజీవిత సంఘటన ఆధారంగా ఉంటుంది. ఈ సినిమాను మల్లేశం మూవీ డైరెక్టర్ దర్శకత్వం వహించడంతో.. సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కొత్త నటులతో రూపొందిస్తున్నారు. ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నప్పటికి మంచి విజయం సాధిస్తుందని మూవీ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 
ఇప్పటికే రాజ్ రాచకొండ తీసిన మల్లేశం సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఈ మూవీ విమర్శకుల నుండి కూడా ప్రశంసలను పొందింది. మల్లేశం సినిమాలాగే 23 సినిమా కూడా మెప్పులు సాధిస్తుందా లేదా చూడాలి. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇలా నిజ జీవిత సంఘటనల ఆధారంగా చాలా సినిమాలు తెరకెక్కాయి. ఒసేయ్ రాములమ్మ, మయూరి, రజకార్, పీపుల్స్ ఎన్కౌంటర్ లాంటి సినిమాలు వచ్చి మంచి హిట్ ని అందుకున్నాయి. మరి ఈ సినిమా హిట్ అవుతుందో. ఫట్ అవుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: