ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన అతి కొద్ది మందిలో న్యాచురల్ స్టార్ నాని ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నాని.. ` అష్టాచెమ్మ ` తో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే సక్సెస్ ముద్దాడిన.. విజయగ‌ర్వం లేకుండా ముందడుగు వేశాడు. పర్ఫెక్ట్ ప్లానింగ్, సరైన స్క్రిప్ట్ సెలక్షన్ తో కెరీర్ ను బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. తన స‌హ‌జ న‌ట‌న‌తో జనాలకు కనెక్ట్ అవుతూ భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు.


క్లాస్ చిత్రాలకే కాకుండా మాస్ చిత్రాలకు కూడా తాను యాప్ట్‌ అవుతానని నిరూపించుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల చెంత చోటు ద‌క్కించుకున్నాడు. ` ద‌స‌రా `, ` హాయ్ నాన్న `, ` సరిపోదా శనివారం ` చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని మంచి జోరు మీద ఉన్న నాని.. రీసెంట్ గా ` హిట్ 3 `తో మ‌రో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీలో వైల్డ్ యాక్టింగ్ తో నాని త‌న‌లోని మ‌రో కోణాన్ని ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశాడు.


వ‌రుస హిట్లు, మూడు వంద‌ల కోట్ల క‌లెక్ష‌న్స్ తో నాని టైర్ 2 హీరోల లిస్ట్ నుంచి టైర్ 1 హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. అదే స‌మ‌యంలో నాని రెమ్యున‌రేష‌న్ కూడా అమాంతం పెరిగిందంటూ ఓ న్యూస్ ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. హిట్ 3 సినిమా వ‌ర‌కు రూ. 20 కోట్ల రేంజ్ లో పారితోషికం అందుకున్న నాని.. ఇక‌పై చేయ‌బోత‌యే చిత్రాల‌కు రూ. 40 కోట్లు డిమాండ్ చేస్తున్న‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది. నాని క్రేజ్‌, భారీగా పెరిగిన ఆయ‌న మార్కెట్ దృష్ట్యా నిర్మాత‌లు సైతం అంత మొత్తం ఇచ్చేందుకు ఏమాత్రం వెన‌కాడ‌టం లేద‌ట‌.


కాగా, నాని అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ విష‌యానికి వ‌స్తే.. ` ది ప్యారడైజ్ ` మూవీతో ప్ర‌స్తుతం ఆయ‌న బిజీగా ఉన్నాడు. దసరా వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ అనంత‌రం నాని- శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్లో రాబోతున్న రెండో చిత్ర‌మిది. ఫుల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని రా అండ్ రస్టిక్‌ లుక్లో క‌నిపించ‌బోతున్నాడు. అలాగే మ‌రోవైపు నిర్మాత‌గా మెగాస్టార్ చిరంజీవితో నాని ఓ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి కూడా శ్రీ‌కాంత్ ఓదెల‌నే ద‌ర్శ‌కుడు. ` మెగా157 ` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: