
ఇక ఆ లొకేషన్స్ లో సినిమా షూటింగ్లో బాలయ్య తో పాటు సినిమాలో పలువురు కీలక ఫైటర్స్ కూడా పాల్గొనబోతున్నారు .. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఇక్కడ షూటింగ్ చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి .. అలాగే ఈ సినిమాలో బాలయ్యకు జంటగా అందాల బామ్మ సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తుంది .. మ్యూజిక్ సెన్సేషన్ నందమూరి తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రామ్ ఆచంట , గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .. అలాగే ఈ సినిమా ను ఈ సంవత్సరం సెప్టెంబర్ 25న ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు ..
బాలయ్య , బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగో సినిమా కావటం అలాగే గతంలో వచ్చిన ఆఖండ భారీ విజయం సాధించడం తో ఇప్పుడు వచ్చే ఆఖండ 2 పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి .. అలాగే ఈసారి అఖండ 2 ను పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు .. ఇక బాలయ్య కూడా వరుస విజయాల తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు .. ఇక మరి ఇప్పుడు అఖండ 2 తో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద బాలయ్య ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారనేది చూడాలి ..