
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. వీటిలో ముందుగా హరిహర వీరమల్లు రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ తర్వాత ఓజీ .. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు లైన్లో ఉంటాయి. పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమా ఇన్నేళ్ల పాటు నిర్మాణంలో ఉండటం అనేది హరిహర వీరమల్లుకే చెల్లుతుంది. 2019 నుంచి 2025 వరకు ఈ సినిమా వార్తల్లో ఉంటూ వస్తుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. 2014 ఎన్నికల తర్వాత సినిమాలు చేయనని ... రాజకీయాలకే పరిమితం అవుతానని పవన్ కళ్యాణ్ చెప్పారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక తన పార్టీని ముందుకు నడిపించడానికి సినిమాలు చేస్తానని ప్రకటించారు. అలాంటి టైం లో నిర్మాత ఏం రత్నం వీరమల్లు ప్రాజెక్టు సెట్ చేశారు. దర్శకుడు క్రిష్ రాబిన్ హుడ్ కథ.. మొగల్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్ ఇలా చాలా విశేషాలతో ఈ సినిమా ప్రారంభమైంది.
అయితే దర్శకుడు కృష్ణ హీరో పవన్ కళ్యాణ్ కు గ్యాప్ వచ్చింది అన్న ప్రచారం ప్రారంభమైంది. దర్శకుడు క్రిష్ రాసుకున్న ఫైటింగ్ సీన్లు .. డ్యాన్స్ సీన్లు ఇవన్నీ మారుతూ వచ్చాయి. సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అంగీకరించిన వకీల్ సాబ్ - భీమ్లా నాయక్ - బ్రో సినిమాలు అన్ని విడుదలయ్యాయి. మంచి పేరు తెచ్చుకున్నాయి. కానీ హరిహార వీరమల్లు మాత్రం అలా నత్తనడకన సాగుతూ వెళ్ళింది. ఇలాంటి టైంలో క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. చివరకు జ్యోతి కృష్ణ దర్శకుడుగా రంగంలోకి దిగాడు. అనుకోకుండా ఇప్పుడు పార్ట్ 2 కూడా ఉంటుందని ప్రకటించారు.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు పార్ట్ వన్ లో 80% సీన్లు దర్శకుడు క్రిష్ రాసుకున్నవే ఉంటాయని తెలుస్తోంది. మరి ఈ లెక్కన జ్యోతికృష్ణను దర్శకుడిగా ఎలా ప్రమోట్ చేస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు