టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రేపటి రోజు కావడం చేత అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు రాత్రి  నుంచే పలు ప్రాంతాలలో హంగామా సృష్టిస్తున్నారు. అయితే మరి కొంతమంది ఎన్టీఆర్ కి సంబంధించి కొన్ని విషయాలు వైరల్ గా చేస్తున్నారు. ఎన్టీఆర్ 18 ఏళ్ల వయసులోనే స్టార్ డం ను సంపాదించుకున్నారు. కెరియర్ ప్రారంభంలో కుటుంబ సపోర్టు కూడా లేదు సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ను చేరదీసి తన పేరుని గిఫ్టుగా ఇచ్చి ఆశీర్వదించారు. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ కాలం చెల్లించడంతో ఎన్టీఆర్ కు ఒక పెద్ద బలం కోల్పోయినట్టుగా అయిపోయిందట.


అయితే హరికృష్ణ గారు పెద్ద నిర్మాతలతో సినిమాలు చేసేలా ప్లాన్ చేశారు. ఆయనకు కూడా పెద్దగా స్టార్ డం లేదు కాబట్టి ఎన్టీఆర్ తో బడ నిర్మాతలు ఎవరు కూడా సినిమాలు చేసే పరిస్థితులలో అప్పట్లో కనిపించలేదట. అందుకే యంగ్ డైరెక్టర్ల చేతిలో ఎన్టీఆర్ కెరియర్ పెట్టడం జరిగింది హరికృష్ణ. అదే ఎన్టీఆర్ కు ప్లస్సుగా మారింది. రాజమౌళి, వివి వినాయక్ వంటి సరైన దర్శకుల చేతిలో పడడంతో స్టార్ డం అతి తక్కువ సమయంలోనే ఎన్టీఆర్ కు లభించింది.


స్టార్ డం వచ్చిన సమయంలో ఎన్టీఆర్ చాలామందిని బ్లైండ్ గా నమ్మేవారు. అలా కొంతమంది చేతిలో ఎన్టీఆర్ మోసపోయారని ముఖ్యంగా ఒక బెస్ట్ ఫ్రెండ్ వల్ల చాలా డబ్బులు కోల్పోయారని విధంగా వార్తలు వినిపించాయి. స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో బడా ప్రాజెక్టులు వెతుక్కుంటూ వస్తున్న సమయంలో కొంతమంది నిర్మాతలు ఎన్టీఆర్ కాల్ షీట్ల కోసం చాలా ఇబ్బందులు పడేవారు.. అలాంటి సమయంలో ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ .. ఇదే క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించి ఎన్టీఆర్ కాల్ షిట్లు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశాడట..


అయితే ఈ విషయం ఎన్టీఆర్ కి తెలియకపోవడంతో పాటుగా ఆ సమయంలో ఎన్టీఆర్ నటించిన ఆంధ్రవాలా, సాంబ, నా అల్లుడు తదితర చిత్రాలన్నీ కూడా ఫ్లాపులయ్యాయి. దీంతో ఎన్టీఆర్ స్వయంగా కొన్ని సినిమాలను సెట్ చేసుకోవడంతో కొంతమంది నిర్మాతలు సహనం కోల్పోయి.. నీవల్ల మేము పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లిస్తున్నాము మాకు కాల్ సీట్లు ఎందుకు ఇవ్వడం లేదంటూ కొంతమంది నిర్మాతలు డిమాండ్ చేశారట.. ఆ సమయంలో ఎన్టీఆర్ నా గురించి మీరెందుకు ఇంట్రెస్ట్ కడుతున్నారని విషయాన్ని అడగ.. అప్పుడు నీ స్నేహితుల ద్వారా అడ్వాన్సు తీసుకొని మరి ఇలా చేస్తారేంటి తారక్ అంటూ అడిగారట.. అయితే ఎన్టీఆర్ పూర్తి విషయాన్ని తెలుసుకున్న తర్వాత నిర్మాతలకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా కూడా వారు మాట వినలేదట.. దీంతో చివరికి ఎన్టీఆర్ చేసేదేమీ లేక తన దగ్గర ఉన్న డబ్బులు అంతా కూడా నిర్మాతలకు ఇచ్చేశారు.. అలా అప్పటినుంచి ఎన్టీఆర్ ఎవరిని కూడా పెద్దగా నమ్మడని కూడా వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: