
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ - సుబ్బు సినిమాలలో నటించారు. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అన్న ఆది సినిమాలో డైలాగ్ తో ఒక్కసారిగా మాస్ హీరో అయిపోయాడు. మాస్‌ను మెప్పించడం చాలా కష్టం .. కానీ ఒకసారి మెప్పిస్తే స్టార్గా ఎదగడానికి ఒక మెట్టు పడినట్టే. అది ఆది సినిమాతో ఒకేసారి ఐదారు మెట్లు ఎక్కేసాడు. ఎన్టీఆర్ ఆది వేసిన పునాదిపై సింహాద్రి సినిమాతో పెద్ద సామ్రాజ్యం నిర్మించాడు. అక్కడి నుంచి ఎన్టీఆర్ ప్రయాణం కొత్తగా వివరించడానికి వర్ణించడానికి ఏం ?లేదు నూనుగు మీసాలు కూడా రాకుండానే వచ్చిన స్టార్డం ఎన్టీఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆ తర్వాత ప్లాపులు చుట్టుముట్టాయి. మళ్లీ తేరుకోవటానికి చాలాకాలం పట్టింది. యమదొంగ సినిమా నుంచి ఎన్టీఆర్ లుక్ మాత్రమే కాదు .. కథలు ఎంచుకునే విధానంలోనూ మార్పు కనిపించింది.
మళ్ళీ వరుస పెట్టి ప్లాపులు.. అయితే పదేళ్ల క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ నుంచి ఎన్టీఆర్ 2.0 దర్శనం ఇచ్చాడు. అక్కడ నుంచి ఎన్టీఆర్ ఇంతింతై ఒటుడింతై అన్నట్టు దూసుకుపోతున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ఇప్పుడు వార్ 2 సినిమాతో ఏకంగా బాలీవుడ్ లోనూ అడుగు పెట్టబోతున్నాడు. అక్కడ కూడా ఎన్టీఆర్ ఖచ్చితంగా మెరుస్తాడు. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రతిభ అలాంటిది.. ఎవరి కెరీరైనా 20 ఏళ్ల నుంచి మొదలవుతుంది.. కానీ ఎన్టీఆర్ 2ఏ ఏళ్లకే స్టార్ అయిపోయాడు. దాన్ని భుజాలపై మోస్తూ మరో పాతికేళ్లు కెరీర్ నిర్మించుకున్నాడు అంటే ఈ ప్రయాణం మరెవ్వరికీ సాధ్యం కాదని చెప్పాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు