
జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్ద మాస్టర్ ప్లాన్ వేశారు. పైకి కనపడుతున్నది ఒకటి లోపల జరుగుతున్నది మరొకటి అన్న చర్చలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా హరిహర వీరమల్లు అన్నది పెద్ద ఇష్యూ అయిపోయింది. జనసేనకి చెందిన సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ స్పందించిన తీరు చూసి రాజకీయ వర్గాలతో పాటు అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. ఎన్నో సమస్యలు అధిగమించి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ఎట్టకేలకు జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సినిమాకు కూడా అన్ని సినిమాల తరహాలోనే ఏ సినిమాకు కూడా రేట్లు పెంచుకోవాలి. ఈ సినిమా హీరో రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రి పైగా సినిమాటోగ్రఫీ మంత్రి కూడా జనసేన పార్టీకి చెందిన కందుల దుర్గేష్. దీంతో ఎలా చూసిన ఈ వ్యవహారం సెన్సిటివ్ గా మారుతుంది. అందుకే థియేటర్ల విషయం ఒకటి తెరమీదకు రాగానే ఉపముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ఇకనుంచి టాలీవుడ్ లో వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావులేదు.. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారు.. వాటిని సంబంధిత విభాగాలకు పంపిస్తారని అన్నది అత్యంత కీలకమైన పాయింట్.
అంటే ఈ లెక్కన హరి హర విరమణ నిర్మాత ఏం రత్నం తమ సినిమాకు టికెట్ రేట్లు పెంచాలని నేరుగా ఏపీ ప్రభుత్వాన్ని కలవరు. టికెట్ రేట్ల పెంపుకు లైన్ క్లియర్ చేసుకోవడం కోసం టాలీవుడ్ బాడీనే ప్రభుత్వాన్ని సంప్రదిస్తుంది. ఏపీలో ఇటీవల ప్రభుత్వం నియమించిన కమిటీని ఈ సినిమాకు టికెట్ రేట్లు ఖరారు చేస్తుంది. ఈ కమిటీల వివిధ శాఖల అధికారులతో పాటు సినీ నిర్మాత వివేక్ కూచిభోట్ల కూడా ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ కు ఎంతో సన్నిహితుడు.. పైగా పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ వ్యాపార భాగస్వామి. సో ఏపీలో హరిహర విరమణ టికెట్ రేట్ల ఖరారుకు పరిశ్రమ ప్రతినిధులు వెళతారు తప్ప నిర్మాత నేరుగా అడగవలసిన పనిలేకుండా చేశారు అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ పవన్ కోపానికి కూడా ఒక కారణం ఉంది అంటున్నారు. ఈ సినిమాను ఏఏం రత్నం దగ్గర నుంచి చాలా తక్కువ రేటుకు తీసుకునేందుకు ఒక నోటి దూల నిర్మాత చేసిన ప్రయత్నం పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురైందని అంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు