
ఇలాంటి పరిస్థితులలో ఈమూవీలో అతిధి పాత్రలో నటించిన ప్రభాస్ కు ఏస్థాయిలో మంచు విష్ణు ఆఫర్ చేసి ఉంటాడు అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది. ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమూవీని నిర్మిస్తున్న మంచు విష్ణుకు ఒక అనుకోని ప్రశ్న ఎదురైంది. విష్ణు పక్కన ప్రభాస్ నటించినందుకు ఎన్ని కోట్ల రూపాయల భారీ పారితోషికం ఇచ్చారు అంటూ ఒక మీడియా సంస్థ ప్రతినిధి ప్రభాస్ ను కార్నర్ చేయడనికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో చాల బిజీగా ఉన్న నేపధ్యంలో మంచు విష్ణు ప్రభాస్ పారితోషికం విషయమై ఒక టాప్ సీక్రెట్ ను బయటపెట్టాడు. ఈమూవీలో ప్రభాస్ నటిస్తే అతడికి ఉన్న క్రేజ్ రీత్యా కోట్లాది రూపాయలు పారితోషికంగా ఇస్తారని అయితే తాము ప్రభాస్ కు శివుడుగా నటించమని కోరిన వెంటనే ఒప్పుకోవాడమే కాకుండా ఈమూవీలో నటించినందుకు ఒక్క రూపాయి కూడ తనకు పారితోషికం వద్దని పారితోషికం ఇస్తే తాను ‘కన్నప్ప’ నటించను అని చెప్పడంతో ఈవిషయంలో ప్రభాస్ తో మరొకసారి మాట్లాడమని తన తండ్రి మోహన్ బాబుతో రాయబారం చేసినప్పుడు ప్రభాస్ నోటి వెంట వచ్చిన మాటలను బయటపెట్టాడు.
మరొకసారి తన వద్ద పారితోషిక విషయం మాట్లాడితే తాను ‘కన్నప్ప’ మూవీలో నటించను అంటూ కండిషన్ పెట్టడమే కాకుండా ఈభారీ ప్రాజెక్ట్ కు ఎటువంటి అవసరం ఏర్పడినా తాను సహాయపడతాను అంటూ ప్రభాస్ తనతో చెప్పిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ మంచువిష్ణు భావోద్వేగానికి లోనయ్యాడు..