ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చాలా తక్కువ సమయంలోనే భారీ స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్స్ లో శ్రీలీల ఒకటి. 2021లో `పెళ్లి సందడి` మూవీతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన‌ శ్రీలీల.. తనదైన అందం, అభినయం మరియు గ్రేస్ ఫుల్ డ్యాన్స్ తో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. టాప్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ బ్యూటీ గా మారింది. `ధమాకా`, `భగవంత్‌ కేసరి` వంటి చిత్రాలు శ్రీలీల కెరీర్ కు మరింత మైలేజ్ ఇచ్చాయి. దాని ఫలితంగా టాలీవుడ్ లోకి ఎంట‌ర్ అయిన‌ రెండేళ్లకే సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకుంది. రెమ్యున‌రేష‌న్ కూడా భారీ రేంజ్‌లో ఛార్జ్ చేసేది.


అయితే ఈ మధ్యకాలంలో హిట్లు కన్నా శ్రీలీలను ఫ్లాపులే ఎక్కువగా పలకరిస్తున్నాయి. ఈ ఏడాది `రాబిన్‌హుడ్‌` మూవీతో అదృష్టం ప‌రీక్షించుకున్నా.. పాప‌కు నిరాశే ఎదురైంది. స‌క్సెస్ రేటు పెద్ద‌గా లేక‌పోవ‌డం, పైగా రెమ్యున‌రేష‌న్ అధికంగా ఉండ‌టంతో.. రీసెంట్ టైమ్‌లో కొన్ని చిత్రాలు శ్రీ‌లీల చేతిదాకా వ‌చ్చి చేజారాయ‌ట‌. ఈ నేప‌థ్యంలోనే ఆఫ‌ర్ల కోసం రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకోవాల‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌.


ఇంత‌కు ముందు వ‌ర‌కు శ్రీ‌లీల ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ పుచ్చుకునేది. అయితే ప్ర‌స్తుతం రూ. 1.75 కోట్లు మాత్ర‌మే డిమాండ్ చేస్తుంద‌ని ఇన్‌సైడ్ బ‌లంగా టాక్ న‌డుస్తోంది. హిట్లు ప‌డిన‌ప్పుడు రెమ్యున‌రేష‌న్ పెంచ‌డం, వ‌రుస ఫ్లాపులు ప‌డితే రెమ్యున‌రేష‌న్ త‌గ్గించ‌డం న‌టీన‌టుల‌కు అల‌వాటు. ఇప్పుడు శ్రీ‌లీల కూడా త‌గ్గితే త‌ప్పేంట‌ని భావించి అదే ప‌ని చేస్తోంద‌ట‌. కాగా, శ్రీ‌లీల తెలుగులో ర‌వితేజ‌తో `మాస్ జాత‌ర‌`, అక్కినేని అఖిల్‌కు జోడిగా `లెనిన్` చిత్రాలు చేస్తోంది. అలాగే `జూనియ‌ర్` అనే తెలుగు-క‌న్న‌డ ద్విభాషా చిత్రంతో పాటు ఒక త‌మిళ మూవీ, ఒక హిందీ మూవీలో శ్రీ‌లీల యాక్ట్ చేస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: