
ఇటీవల కాలంలో రీ రిలీజ్లు .. స్ట్రైట్ రిలీజ్ సినిమాలు ఎప్పుడు క్లాస్ అవ్వలేదు. అన్ని శుక్రవారం రిలీజ్ అవుతున్న వేటిదారి వాటిది. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు వచ్చిన రీ రిలీజ్ సినిమాలలో నాలుగైదు సినిమాలు మినహా మిగిలినవి ఏవి అంత ప్రభావం చూపించ లేకపోయాయి. రీ రిలీజ్ సినిమాలలో ఎక్కువగా మహేష్ బాబు సినిమాలకే మంచి కలెక్షన్లు వస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం ఓ స్ట్రైట్ సినిమా ను రీ రిలీజ్ సినిమా దెబ్బ కొట్టింది. అది కూడా మహేష్ బాబు సినిమా కావటం విశేషం. ఆ స్ట్రైట్ సినిమా భైరవం కాగా ... ఆ రీ రిలీజ్ సినిమా ఖలేజా. అవును మహేష్ నటించిన ఈ సినిమా భైరవం సినిమాపై గట్టి ప్రభావం చూపించింది. ఈ విషయాన్ని మీడియా ముఖంగా నిర్మాత ఒప్పుకున్నారు. తమ సినిమాపై మహేష్ బాబు ఖలేజా ఎఫెక్ట్ పడిందని అన్నారు రాధా మోహన్. అయితే దానికి ఎవరు ఏం చేయలేరని బాధపడిన ఆయన ఎవరి సినిమా వాళ్ళు రిలీజ్ చేసుకుంటారని .. అంటూనే రీ రిలీజ్ లు కూడా శుక్రవారం ఎందుకు ? అని ప్రశ్నించారు.
శుక్ర , శని ఆదివారాలు స్ట్రైట్ సినిమాలుకు వదిలేసి సోమవారం రిలీజ్ పెట్టుకోవాలని సూచించారు. హీరో మంచు మనోజ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఖలేజా సినిమా వల్ల తమ సినిమా కాస్త దెబ్బతినిందని .. రీ రిలీజ్ ల విషయంలో ఫిలిం ఛాంబర్ , సినీ పెద్దలు ఓ నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చిందని మనోజ్ తెలిపాడు. అయితే నిజంగా ఖలేజా దెబ్బకొట్టిందా లేదా ? ఆక్యుపెన్సి తగ్గిందా ? అన్నది చూడాలి. ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలలో భైరవం సినిమాతో సమానంగా ఖలేజా సినిమా రీ రిలీజ్ అయింది. ఓవర్సీస్ లో అయితే భైరవం కంటే ఒక మెట్టు పైనే ఉంది మహేష్ బాబు సినిమా.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు